ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డ్రగ్స్ వ్యవహారం (Drugs Issue) కొన్నిరోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై రాజకీయాలు కూడా వేడెక్కాయి. ముఖ్యంగా రాష్ట్రంలో గంజాయి భారీగా పట్టుబడుతుండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. (Janasena Chief Pawan Kalyan) గంజాయి స్మగ్లింగ్ (Ganja Smuggling)పై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఏపీ డ్రగ్స్ కు హబ్ గా మారిందని ఆయన ఆరోపించారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తాను 2018లో మన్యంలో తాను మన్యంలో పర్యటించిన సమయంలోనూ గంజాయి సమస్యపై ఫిర్యాదులు వచ్చాయన్న పవన్.. ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పవన్ ట్వీట్స్ (Pawan Kalyan Tweets) సోషల్ మీడియాలో (Social Media) సంచలనంగా మారాయి.
గంజాయి సాగు సామాజిక ఆర్ధిక అంశమని.. విశాఖ మన్యం నుంచి తుని వరకు చదువుకొని ఉపాధిలేని కుర్రాళ్లు గంజాయి స్మగ్లింగ్ లో చిక్కుకుంటున్నారన్నారు. ఐతే కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారని పవన్ ఆరోపించారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్యదశలో ఉందని.. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందన్నారు. అప్పుడు ఇంకా ఎక్కవ బయటకు వెళ్తోందన్న పవన్.. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారని.. ఇప్పుడు ఆ పని వదిలి బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారన్నారు. ఇక్కడ సీజ్ చేసేదానికంటే రాష్ట్రం దాటిపోతున్న సరుకే ఎక్కువగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ రంగనాథ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, అలాగే కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు ఏపీ నుంచి గంజాయి వస్తోందన్నారు. అలాగే మహారాష్ట్రలో ఏపీ నుంచే గంజాయి వస్తోందంటూ అక్కడి ఛానల్స్ లో ప్రసారమైన వార్తలను కూడా పవన్ ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. పవన్ ఆరోపణలపై ప్రభుత్వం వైపు నుంచి స్పందన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో గంజాయి సాగుపై టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. రాష్ట్రంలో కోటి కేజీల గంజాయి ఉత్పత్తి అవుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అరోపించారు. ప్రభుత్వం, పోలీసులు గంజాయి ఉత్పత్తిని ఆపేలేకపోతున్నారన్నారు. మరోవైపు ఏపీలో డ్రగ్స్ అంశంపై ఢిల్లీలో మాట్లాడిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. టీడీపీ హయాంలోనే గంజాయి మాఫియా రెచ్చిపోయిందన్నారు. అప్పటి మంత్రులు, అధికార పార్టీ నేతలే గంజాయి డాన్లుగా ఎదిగారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ganja case, Janasena party, Pawan kalyan