గాజువాకలో జనసేనకు షాక్... పవన్ కల్యాణ్ పరాజయం

పవన్ కల్యాణ్‌కు 30,905 ఓట్లు రాగా... నాగిరెడ్డి 34,712 ఓట్లు సాధించారు. 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో టీడీపీ నుంచి నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: May 23, 2019, 4:13 PM IST
గాజువాకలో జనసేనకు షాక్... పవన్ కల్యాణ్ పరాజయం
పుస్తకం చదువుతున్న పవన్ కల్యాణ్ (File)
news18-telugu
Updated: May 23, 2019, 4:13 PM IST
జనసేన అధినేతకు విశాఖ జిల్లాలో షాక్ తగిలింది. గాజువాకలో పోటీకి దిగిన పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యాడు. గాజువాకలో పోటీకి దిగిన పవన్ ఓటమి పాలయ్యారు.వైసీసీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్ పై పోటీ చేసి గెలుపొందారు. పవన్ కల్యాణ్‌కు 30,905 ఓట్లు రాగా... నాగిరెడ్డి 34,712 ఓట్లు సాధించారు. 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో టీడీపీ నుంచి నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్‌కు బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 29,578 ఓట్లు మాత్రమే దక్కాయి.

2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లలో సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం ముందుకు సాగినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జనసేనకు గాజువాకలో షాక్ తగిలినట్లైంది. మరోవైపు భీమవరంలో మాత్రం పవన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో ప్రచారం చేసే విషయంలో ఇబ్బందిపడుతూ వచ్చారు. ఈ విషయంలో ఆయనకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. గురువారం పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్‌ విజయావకాశాల్ని దెబ్బతీశాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...