PAWAN KALYAN LOST IN GAJUWAKA AND BHIMAVARAM IN AP ASSEMBLY ELECTIONS 2019 DEFEATED BY YSRCP AK
పవన్ కళ్యాణ్‌కు పరాభవం... గాజువాకతో పాటు భీమవరంలోనూ ఓటమి
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
Pawan Kalyan lost in Bhimavaram and Gajawaka | గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓటమి కాస్త ముందుగానే ఖరారు కాగా... భీమవరంలో మాత్రం తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనుతో విజయం కోసం బాగానే పోరాడారు. అయితే ఇందులో అంతిమంగా వైసీపీ అభ్యర్థిదే పైచేయి అయ్యింది. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతితో పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అస్సలు కలిసి రాలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్... రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓటమి కాస్త ముందుగానే ఖరారు కాగా... భీమవరంలో మాత్రం తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనుతో విజయం కోసం బాగానే పోరాడారు. అయితే ఇందులో అంతిమంగా వైసీపీ అభ్యర్థిదే పైచేయి అయ్యింది. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతితో పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని మొదట్లో వార్తలు వినిపించాయి. ఆ తరువాత జనసేన అంతగా ప్రభావం చూపలేకపోయినా... పవన్ కళ్యాణ్ మాత్రం కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారని పలువురు అంచనా వేశారు.
విశాఖలోని గాజువాక లేద భీమవరంలో ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని జనసేన వర్గాలు భావించాయి. అయితే ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఏ దశలోనూ తన ప్రత్యర్థులపై పూర్తి ఆధిక్యతను సాధించలేకపోయారు. అటు గాజువాక, ఇటు భీమవరంలోనూ పవన్‌తో ఆధిక్యత దోబూచులాడుతూ వచ్చింది. ముందుగా గాజువాకలో ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్... భీమవరంలో అయినా గెలుస్తారని అభిమానులు ఎదురుచూశారు. అయితే చివరకు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్‌కు ఓటమి తప్పదు. రెండు చోట్ల పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూడటం గమనార్హం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.