రైతుల కోసం పవన్ నిరసన.. కాకినాడ దీక్ష పేరు ఖరారు..

తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిసరాల్లో తిరిగి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని.. వారి కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనసేన రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నానని స్పష్టం చేశారు

news18-telugu
Updated: December 10, 2019, 10:41 PM IST
రైతుల కోసం పవన్ నిరసన.. కాకినాడ దీక్ష పేరు ఖరారు..
పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12న కాకినాడలో దీక్ష చేయనున్నారు. రైతుల కోసం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభమవుతుంది. ఐతే ఈ దీక్షకు జనసేన రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేసింది ఆ పార్టీ. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల సమస్యను బలంగా తెలియజేయడానికే ఈ దీక్షను తలపెట్టినట్లు వెల్లడించారు పవన్.

అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఏపీలో మున్ముందు ఆ పరిస్థితులు ఉండవని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వరి పంట వేయడానికి రైతులు భయపడుతున్నారని.. రాష్ట్రంలో పరిస్థితులు అంత దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిసరాల్లో తిరిగి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని.. వారి కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనసేన రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నానని స్పష్టం చేశారు.

Published by: Shiva Kumar Addula
First published: December 10, 2019, 10:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading