జగన్ కోరిక నెరవేరదు.. బీజేపీతో కలిశాక పవన్ కీలక వ్యాఖ్యలు

మెజార్టీ ఉంది కదా అని.. పద్దతి పాడూ లేకుండా చేస్తే.. ఊరుకోబోమని హెచ్చరించారు పవన్. 5 కోట్ల మంది ఆంధ్రా ప్రజలు కోరుకుంటేనే అమరావతి వచ్చిందని స్పష్టం చేశారు.


Updated: January 16, 2020, 4:01 PM IST
జగన్ కోరిక నెరవేరదు.. బీజేపీతో కలిశాక పవన్ కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, జగన్
  • Share this:
ఏపీలో అమరావతి కోసం ఆందోళనలు జరుగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీలో పొత్తు కుదిరిన అనంతరం అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం ఏం నిర్ణయించుకున్నా అది కుదరదని.. వాళ్లు అనుకోవడమే తప్ప వాస్తవానికి తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు జనసేనాని. మెజార్టీ ఉంది కదా అని.. పద్దతి పాడూ లేకుండా చేస్తే.. ఊరుకోబోమని హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆంధ్రా ప్రజలు కోరుకుంటేనే అమరావతి వచ్చిందని స్పష్టం చేశారు.

వైసీపీ నిర్ణయించుకున్నంత మాత్రం జరిగిపోదు. వాస్తవ రూపానికి తీసుకెళ్లలేరు. ఒకవేళ జరిగినా మేం చూస్తూ ఊరుకోం. రోడ్ల మీదకు వస్తాం. ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. తెగించే నాయకత్వం ఉంది. మెజార్టీ ఉంది కదా అని పద్దతీ పాడు లేకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదు. జగన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే కుదరదు. 5 కోట్ల మంది ఆంధ్రులు కోరకుంటేనే అమరావతి వచ్చింది.
పవన్ కల్యాణ్


జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేశారు. అమరావతిలో భూసమీకరణను ఆయన సమర్థించారని చెప్పుకొచ్చారు. అమరావతిని మార్చడం ఇళ్లను మార్చినంత ఈజీ కాదన్న పవన్.. అలా మార్చుకుంటే వెళ్తే ఇక ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ, జనసేన చాలా బలంగా పోరాడుతాయని స్పష్టం చేశారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>