పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ వ్యూహానికి ఇది పెద్ద పరీక్షే...

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడమా? మానడమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న ప్రశ్న.

news18-telugu
Updated: October 4, 2019, 7:32 PM IST
పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ వ్యూహానికి ఇది పెద్ద పరీక్షే...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకట స్థితిలో పడే పరిస్థితి ఏర్పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక జనసేనానిని ఇరకాటంలో పడేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు జనసేనానిని కోరారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ లతో చర్చించారు. దీనిపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నారు. తన వెన్నునొప్పికి చికిత్స ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి కూడా వీహెచ్ ఇలాగే పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. ఆ సమయంలో జనసేనాని వెంటనే స్పందించారు. ఆ తర్వాత సెలబ్రిటీలు కూడా వరుసగా సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.

ప్రస్తుతం హుజూర్ నగర్‌లో మొత్తం 28 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ తరఫున రామారావు పోటీ చేస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సైదిరెడ్డి మధ్యనే పోటీ ఉండనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు పలికింది. ఈ క్రమంలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతు కోరుతోంది. టీజేఎస్ హస్తం పార్టీకి జైకొట్టింది.


హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడమా? మానడమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న ప్రశ్న. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే.. గతంలో నల్లమల వ్యవహారాన్ని కూడా కలిపుకొని.. జనసేన పార్టీ కాంగ్రెస్‌కు అనుబంధ పార్టీ అనే ముద్ర వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. కేసీఆర్‌కు షాక్ ఇచ్చే అద్భుత అవకాశాన్ని ఎందుకు మిస్ చేశాడనే విమర్శలు వస్తాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్తంగా ఉండిపోతే.. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏదైనా పోరాటాన్ని భుజానికి ఎత్తుకుంటే ఏ పార్టీ నుంచి కూడా సహకారం అందదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే ఇరకాటంలో పడిపోయారు పవన్ కళ్యాణ్.
First published: October 4, 2019, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading