విశాఖ సీటు మళ్లీ ఆయనకే... పవన్ కళ్యాణ్ సంకేతాలు...

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nadendla Manohar)

జనసేనలో పవన్ కళ్యాణ్‌కు లక్ష్మీనారాయణకు మధ్య ఏర్పడిన కొంత గ్యాప్ కారణంగా... మరోసారి ఆయనకు జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

 • Share this:
  వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విశాఖపట్నం ఏపీకి పరిపాలన రాజధానిగా మారనుంది. దీంతో ఈ నగరానికి అన్ని రకాలుగా ప్రాధాన్యత పెరగనుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ... ఇక రాజకీయ రాజధానిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున విశాఖ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ప్రాధాన్యత, పోటీ కూడా పెరగనుంది. గత లోక్ సభ ఎన్నికల్లో విశాఖ లోక్ సభకు అన్ని పార్టీల నుంచి ప్రముఖలు బరిలోకి దిగారు. జనసేన తరపున ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఓడిపోయినప్పటికీ గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు సాధించారు.

  అయితే జనసేనలో పవన్ కళ్యాణ్‌కు లక్ష్మీనారాయణకు మధ్య ఏర్పడిన కొంత గ్యాప్ కారణంగా... మరోసారి ఆయనకు జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల ఈ విభేదాలు సమసిపోయాయి. దీంతో పవన్ కళ్యాణ్ విశాఖ విషయంలో లక్ష్మీనారాయణకే ప్రాధాన్యత ఇచ్చారు.

  Jd Lakshminarayana reaction on leaving janasena,jd Lakshminarayana response on party change,Pawan Kalyan janasena Party,JD Lakshminarayana,JD to join bjp,ap bjp,ap bjp joinings,janasena news,Pawan Kalyna news,పార్టీ మార్పుపై స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్‌బై,ఏపీ బీజేపీ,బీజేపీలోకి జేడీ లక్ష్మీనారాయణ
  లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)


  ఇటీవల విశాఖపట్నంలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్... విశాఖ లోక్ సభ జనసేన ఇంఛార్జ్‌గా లక్ష్మీనారాయణనే నియమించారు. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు జనసేనలో మళ్లీ లక్ష్మీనారాయణకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పడానికి ఇది సంకేతమనే ప్రచారం కూడా సాగుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: