సీఎం జగన్‌తో వార్‌కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ?

ఇప్పటికే రాజధాని అమరావతి, ఇసుక కొరత వంటి పలు అంశాల్లో వైసీపీపై విమర్శలు గుప్పించిన జనసేన... రేపు వైసీపీ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేయనుంది.

news18-telugu
Updated: September 13, 2019, 12:10 PM IST
సీఎం జగన్‌తో వార్‌కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ?
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ... దాన్ని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఏపీలో వైసీపీని విమర్శించడంలో టీడీపీ ముందువరుసలో ఉండగా... ఆ తరువాత స్థానంలో బీజేపీ ఉంది. అయితే త్వరలోనే టీడీపీ స్థాయిలో వైసీపీని జనసేన కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజధాని అమరావతి, ఇసుక కొరత వంటి పలు అంశాల్లో వైసీపీపై విమర్శలు గుప్పించిన జనసేన... రేపు వైసీపీ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేయనుంది.

ఈ నివేదిక ఆధారంగానే జనసేన, వైసీపీపై విమర్శల దాడి మొదలుపెడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపీలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుని టీడీపీకి ధీటుగా ఎదగాలని ప్లాన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్... ఈ క్రమంలో అధికార పార్టీపై రాజకీయ దాడిని తీవ్రతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జనసేన విడుదల చేయబోయే నివేదికలో ఏముంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఏపీలో అధికార వైసీపీకి వంద రోజుల సమయం ఇవ్వాలని డిసైడయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఇక సీఎం జగన్‌పై రాజకీయ దాడిని ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.


First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు