Modi Jagan Meeting: ప్రధాని మోదీతో జగన్ భేటీ, ఊపిరి పీల్చుకున్న పవన్ కళ్యాణ్

YS Jagan Delhi Tour: బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పు లేదని, కానీ ఒకవేళ పొత్తుపెట్టుకుంటే అందులో జనసేన ఉండదని పవన్ కళ్యాణ్ గతంలో కుండబద్దలు కొట్టారు.

news18-telugu
Updated: October 6, 2020, 2:22 PM IST
Modi Jagan Meeting: ప్రధాని మోదీతో జగన్ భేటీ, ఊపిరి పీల్చుకున్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్
  • Share this:
YS Jagan meeting PM Modi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరేందుకే ఈ భేటీ జరిగినట్టు సమావేశానికి ముందు తీవ్ర చర్చ జరిగింది. అయితే, ప్రధాని మోదీని కలిసిన తర్వాత వచ్చిన వార్తల ప్రకారం ఎన్డీయేలో చేరడానికి జగన్ విముఖత వ్యక్తం చేశారని, అయితే, బీజేపీకి అవసరమైనప్పుడు మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా వార్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊరటే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద అటు బీజేపీ - జనసేన విమర్శల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆలయాల మీద దాడుల నేపథ్యంలో జగన్ సర్కారు మీద బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే అంతర్వేది రథం దగ్ధం ఘటన కేసును సీబీఐకి అప్పగించడానికి జగన్ సిద్ధమయ్యారు.

ఒకవేళ వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరితే జనసేన పార్టీ ఇరుకున పడేది. ఎందుకంటే, కేంద్రంలో వైసీపీ చేరితో రాష్ట్రంలో బీజేపీ జగన్ మీద విమర్శలు చేయడానికి సాహసించదు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అయితే, ఇప్పుడు జగన్ ఎన్డీయేలో చేరకపోవచ్చని, బయట నుంచి మాత్రమే మద్దతిస్తారనే వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు కొంత ఊరట లభించినట్టే.

పవన్ కళ్యాణ్ జనసేన (pawan kalyan)
పవన్ కళ్యాణ్
(pawan kalyan)


గతంలో కూడా జగన్ ఎన్డీయే గూటికి చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పు లేదని, కానీ ఒకవేళ పొత్తుపెట్టుకుంటే అందులో జనసేన ఉండదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. అమరావతి కోసం ఎలాంటి షరతులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు. వైసీపీ ఎన్డీయేలో చేరకపోతే జనసేన - బీజేపీ పొత్తుకు ప్రస్తుతానికి వచ్చిన నష్టం లేదు. అయితే, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది చూడాలి.

AP CM Jagan Delhi Tour, ycp in nda, ycp join in nda, bjp politics, ycp vs nda, ycp vs bjp, will ycp join hands with bjp, సీఎం జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీయేలోకి వైసీపీ, బీజేపీతో వైసీపీ దోస్తీ, బీజేపీతో వైసీపీ కలుస్తుందా, జనసేన పార్టీ,
ప్రధాని మోదీతో జగన్ భేటీ (File)


2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఎలక్షన్స్‌లో టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీ , బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. జనసేన పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతివ్వడం లేదని పవన్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ పార్టీకి కేవలం ఒకే సీటు వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత పవన్, బీజేపీతో జట్టుకట్టారు. తాము కలసి పనిచేస్తామని స్పష్టం చేశాయి.

cm jagan, jagan delhi tour, ap news, జగన ఢిల్లీ టూర్, సీఎం జగన్, unlock1, lockdown5, corona warrior, extend the lockdown, corona update, fight with corona virus, covid19, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్1,
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ (File)


ఎన్డీయేలోకి కొత్త మిత్రులను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ.. వైసీపీని ఎన్డీయేలో చేరాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో శివసేన, ఇటీవల వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అకాళీదల్.. ఎన్డీయేకు దూరమయ్యాయి. దీంతో తమ కూటమిలోకి కొత్త మిత్రులను తీసుకురావాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమతో స్నేహంగా ఉంటున్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఈ దిశగా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరితే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ జాతీయ నాయకత్వం ఆఫర్ చేసినట్టు సమాచారం.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 6, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading