ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. సీట్లపైనా స్పందించిన జనసేనాని

Pawan Kalyan | ‘ఎన్నికలు పూర్తయ్యాక మాకు 120 వస్తాయని వైసీపీ, మాకు ఇన్ని వస్తాయని టీడీపీ లెక్కలు వేశాయి. మనం అలా లెక్కలు వేయం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: April 21, 2019, 10:49 PM IST
ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. సీట్లపైనా స్పందించిన జనసేనాని
పవన్ కళ్యాణ్
news18-telugu
Updated: April 21, 2019, 10:49 PM IST
ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత పది రోజులుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గుంటూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్ష సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ అధినేత జగన్ తమకు 120 సీట్లు వస్తాయని ప్రకటించారని, టీడీపీ కూడా తమకు 130 సీట్లు వస్తాయని ప్రకటించుకుందని, అయితే, జనసేన మాత్రం సీట్ల గురించి ఆలోచించడం లేదని చెప్పారు. మార్పు రావాలన్న ఉద్దేశంతోనే తాను పోరాటాన్ని మొదలుపెట్టానని ఆ మార్పు చిన్నగా మొదలవుతుందని జనసేనాని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలు పూర్తయ్యాక మాకు 120 వస్తాయని వైసీపీ, మాకు ఇన్ని వస్తాయని టీడీపీ లెక్కలు వేశాయి. మనం అలా లెక్కలు వేయం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓటింగ్ సరళి గురించి తెలుసుకోమని మాత్రమే తాను నాయకులకు చెప్పానన్నారు.

ఇకపై గ్రామాల నుంచి నాయకులను తయారుచేసే పనిలో ఉండాలని నేతలకు సూచించారు. తెలంగాణలో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని అందుకే నిర్ణయించినట్టు చెప్పారు. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలన్నారు. ప్రతి చోటా రెండు కుటుంబాలే ఆపరేట్ చేస్తున్నాయని, దీన్ని మార్చాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...