పద్దతేనా ఇది.. క్రమశిక్షణ లేకనే ఓడిపోయాం : ఫ్యాన్స్‌పై పవన్ సీరియస్

రైతు సమస్యలపై మాట్లాడుతున్న తరుణంలో ఫ్యాన్స్ అరుపులు,కేకలతో అడ్డు తగలడంతో పవన్ అసహనానికి గురయ్యారు.

news18-telugu
Updated: December 8, 2019, 5:54 PM IST
పద్దతేనా ఇది.. క్రమశిక్షణ లేకనే ఓడిపోయాం : ఫ్యాన్స్‌పై పవన్ సీరియస్
పవన్ కళ్యాణ్
  • Share this:
జనసైనికులకు క్రమశిక్షణ లేకపోవడం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. క్రమశిక్షణ లేకపోతే ఏమీ చేయలేరని.. జనసైనికులు సరిగా లేకపోవడం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.పవన్ కల్యాణ్ ఓవైపు హెచ్చరిస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం అలాగే అరుపులు,కేకలు పెట్టడంతో అసహనానికి గురయ్యారు.పద్దతా ఇది..? అంటూ ఫైర్ అయ్యారు. దయచేసి అరవడం ఆపి పెద్దలు మాట్లాడుతుంటే వినాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో పవన్ మాట్లాడారు.రైతు సమస్యలపై మాట్లాడుతున్న తరుణంలో ఫ్యాన్స్ అరుపులు,కేకలతో అడ్డు తగలడంతో పవన్ అసహనానికి గురయ్యారు.

కాగా,రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు సంక్షేమ పథకాలు అమలుచేయాలని పవన్ డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఈ నెల 12న కాకినాడలో దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా చేయి దాటుతాయో చెప్పలేనన్నారు. ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేసే నేతలు.. రైతుల కోసం మాత్రం డబ్బులు ఖర్చు పెట్టరని మండిపడ్డారు. ధాన్యం విక్రయించిన రైతులకు రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>