ఢిల్లీలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన కేంద్రమంత్రులు..?

పవన్ ఢిల్లీ పర్యటనపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేస్తేనే.. ఢిల్లీలో అసలేం జరుగుతోందన్నది బయటకు తెలిసే అవకాశముంది.

news18-telugu
Updated: January 12, 2020, 4:16 PM IST
ఢిల్లీలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన కేంద్రమంత్రులు..?
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్... తెరవెనక ఏం జరుగుతోంది?
  • Share this:
అమరావతిలో రాజధాని ప్రాంతం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న క్రమంలో శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆయన్ను కేంద్ర పెద్దలే పిలిచారా? లేదంటే పవనే తనకు తానుగా వెళ్లారా? అనేది స్పష్టత లేదు. ఐతే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దాంతో పవన్ పర్యటన రహస్యంగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాజధాని కోసమే పవన్ ఢిల్లీ వెళ్లిఉంటే.. పర్యటన విషయంలో అంత గోప్యత ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అంతేకాదు ఢిల్లీలో ఎవరితో ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారన్న దానిపైనా మీడియాకు సమాచారం లేదు. ఈ క్రమంలో పవన్ పర్యటనపై మరో ప్రచారం జరుగుతోంది. అసలు పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. శనివారం రాత్రి నుంచి ఢిల్లీలో ఆయన నిరీక్షిస్తున్నారని సమాచారం. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో శనివారం సాయంత్రం పవన్ భేటీ అవుతారని వార్తలు వచ్చినప్పటికీ.. అదేం జరగలేదని తెలుస్తోంది. మరి నిజంగానే పవన్‌కు అపాయింట్‌‌మెంట్ దొరకలేదా? లేదంటే సీక్రెట్‌గా కలుస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పెద్దలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన అధినేతకు మంత్రులు షాకిచ్చారని చెప్పుకుంటున్నారు. గత పర్యటనలోనూ ఆయన ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటనపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేస్తేనే.. ఢిల్లీలో అసలేం జరుగుతోందన్నది బయటకు తెలిసే అవకాశముంది.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు