PAWAN KALYAN DIALS AP BJP CHIEF KANNA LAKSHMINARAYANA SEEKS SUPPORT FOR HIS LONG MARCH ON SAND SHORTAGE BA
హలో.. నేను పవన్ కళ్యాణ్.. బీజేపీ కీలక నేతకు జనసేనాని ఫోన్..
పవన్ కళ్యాణ్
ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని పవన్ కళ్యాణ్‌ను కలసిన కొందరు భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేశారు. నవంబర్ 3న పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ చేపట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా బాధపడుతున్న భవన నిర్మాణ కార్మికుల బాధలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. తన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో పవన్ కళ్యాణ్ తొలిగా బీజేపీ అధ్యక్షుడు కన్నాకు ఫోన్ చేసి సపోర్ట్ ఇవ్వాలని కోరారు. కన్నా లక్ష్మీనారాయణ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు జనసేన పార్టీ తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోయారని జనసేన తెలిపింది. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోదీ దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు.
ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌ను కలసిన కొందరు భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేశారు. దీనికి జనసేనాని చొరవ చూపాలని కోరారు. తెలంగాణాలో జరుగుతున్న ఆర్ర్టీసీ సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో కుడా చూపాలని వారు విన్నవించారు. వారి విన్నపానికి సంసిద్ధత తెలిపిన పవన్ కళ్యాణ్ ముందుగా కన్నా లక్ష్మి నారాయణతో మాట్లాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.