వైఎస్ వివేకా హత్య కేసుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

దీంతో పాటు... విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసుపై పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు.

news18-telugu
Updated: September 14, 2019, 12:15 PM IST
వైఎస్ వివేకా హత్య కేసుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వైఎస్ వివేకా, పవన్ కల్యాణ్
  • Share this:
సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వివేకా హత్య కేసును తేల్చకపోతే సీబీఐకు ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేనాని. వివేకా హత్యపై ఏపీ డీజీపీ క్లారిటీ ఇవ్వాలన్నారు. జగన్ చిన్నాన్న హత్యకేసులో ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయలన్నారు. దీంతో పాటు... విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసుపై పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... కోడికత్తి దాడిపై సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయిందని డిమాండ్ చేశారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వారం ముందే... కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. శ్రీనివాస్ బెయిల్‌పై బయటకు వచ్చాడని గుర్తు చేశారు. అందుకే కోడికత్తి కేసుపై కూడా స్పష్టమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే... వైఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసుల్ని సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు