Pawan Kalyan: రాటుదేలిన పవన్ కళ్యాణ్, ఢిల్లీలో బీజేపీ ముందు కీలక ప్రతిపాదన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమకాలీన రాజకీయాల్లో రాటుదేలినట్టు కనిపిస్తున్నారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలనే సూత్రాన్ని పవన్ కళ్యాణ్ కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: November 24, 2020, 8:40 AM IST
Pawan Kalyan: రాటుదేలిన పవన్ కళ్యాణ్, ఢిల్లీలో బీజేపీ ముందు కీలక ప్రతిపాదన
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమకాలీన రాజకీయాల్లో రాటుదేలినట్టు కనిపిస్తున్నారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలనే సూత్రాన్ని పవన్ కళ్యాణ్ కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉరుము లేకుండా పిడుగు పడినట్టు సడన్‌గా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లడం వెనుక మెగా ప్లాన్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేనాని తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. జనసైనికులు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మద్దతు ఇచ్చారు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో పవన్ సడన్‌గా హస్తినకు వెళ్లారు. ఈ రోజు (నవంబర్ 24)న ఢిల్లీ పెద్దలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన చేయనున్నట్టు తెలిసింది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉప ఎన్నికల సీటు తమకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టనున్నట్టు తెలిసింది.

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది. అలాగే, ఏపీ బీజేపీ నేతలకు కూడా ఇది సవాలుగా మారింది. తెలంగాణలో బీజేపీ చూపిస్తున్న దూకుడు ఏపీలో కమలనాధులు చూపకపోతే పార్టీ అధిష్టానం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని ఏపీ బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. గతంలో ఓ సారి తిరుపతిలో బీజేపీ గెలుపొందింది. కాబట్టి, తమ అభ్యర్థిని నిలపాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా జరిపింది.

అయితే, ఏపీ బీజేపీ నేతల ఆశలపై నీళ్లు జల్లుతూ పవన్ కళ్యాణ్ తిరుపతి సీటు కోరుతున్నట్టు తెలిసింది. రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. జనసేన ఎప్పుడూ మద్దతు (2014 ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, వగైరా) ఇవ్వడమే కానీ, తీసుకోవడం లేదు కాబట్టి.. ఈసారి తిరుపతి సీటు తీసుకుని, తమ అభ్యర్థిని బరిలో నిలపాలని జనసేన భావిస్తోంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే తిరుపతిలో మాత్రమే విజయం సాధించారు. తిరుపతి లోక్‌సభ ఎస్సీ రిజర్వ్‌డ్. అయితే, ఆ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. క్రియాశీలక ఓట్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేన భావిస్తోంది.

2019లో తిరుపతి నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇక్కడ వైసీపీ తరఫున ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి పేరు ఖరారైనట్టు తెలిసింది. అలాగే, టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ ఇక్కడ పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సీటు తమకు ఇవ్వాలని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 24, 2020, 8:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading