news18-telugu
Updated: November 17, 2020, 3:09 PM IST
పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు కోల్పోయిన వాటిని అందచేయడమని అని తెలిపారు. అది జనసేన చేస్తుందని పార్టీ శ్రేణుల భేటీలో అన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు అని అన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా నిలబడేవారై ఉండాలని సూచించారు.
తనకు జీవితంలో జీవితంలో పారిపోవడం తెలియదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని వ్యాఖ్యానించారు. అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతానని అన్నారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విభజించి పాలించే ఈ విధానంతో వెళ్తున్నారని మండిపడ్డారు.
నేడు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజవకర్గాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. అనంతరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రేపు అమరావతి పోరాట సమితి నేతు, కొందరు మహిళా రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వనున్నారు. ఆ తరువాత 32 నియోజకవర్గాల నేతలతో సమావేశమై... పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై సూచనలు చేయనున్నారు. ఏపీలో జనసేన పార్టీ పరిస్థితులపై ముఖ్య నాయకులు నివేదికల రూపంలో ఇచ్చారు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న పవన్.. రాజకీయాల కార్యక్రమాలకు సైతం సమయం కేటాయించాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది.
Published by:
Kishore Akkaladevi
First published:
November 17, 2020, 2:28 PM IST