జగన్ నిర్ణయం... వివాదమే అంటున్న పవన్ కళ్యాణ్

ఓ వైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: February 26, 2020, 4:58 PM IST
జగన్ నిర్ణయం... వివాదమే అంటున్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
  • Share this:
అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. అమరావతిలో నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని... చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.

ఓ వైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని గ్రామాలలోనే కాకుండా జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు నెలకొని ఉన్నాయని... అసైన్డ్ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఏమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని వెల్లడిస్తోందని విమర్శించారు. .


First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు