నా పెళ్లిళ్లతో మీకేంటి నష్టం ?... జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్

ఏపీ సీఎం జగన్ తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు స్పందించబోనని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. తాము కేవలం సమస్యపై మాత్రమే మాట్లాడతామని అన్నారు.

news18-telugu
Updated: November 12, 2019, 4:37 PM IST
నా పెళ్లిళ్లతో మీకేంటి నష్టం ?... జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
  • Share this:
ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను పక్కదారి పట్టించేందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు స్పందించబోనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తాము కేవలం సమస్యపై మాత్రమే మాట్లాడతామని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా పరిపాలన చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై స్పందించాలని... కేవలం విధి విధానాలపై మాత్రమే మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న తమ పార్టీ ఓ సమస్యపై మాట్లాడాల్సి వస్తోందంటే... పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.

తన గురించి మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నారని... మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నా మూడు పెళ్లిళ్ల కారణంగా ఆయన జైలుకు వెళ్లలేదని అన్నారు. సీఎం జగన్‌ను చూసుకుని 151 ఎమ్మెల్యేలు ఎగిరెగిరి పడుతున్నారని... ఆయన పరిస్థితిలో తేడా వస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు.

ఏపీలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ ప్రభుత్వంపై కూడా పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడితే... విద్యార్థులు నష్టపోతారని పవన్ కళ్యాణ్ అన్నారు. వీటి గురించి ఏ మాత్రం అధ్యయనం చేయకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని పవన్ అన్నారు. ఇసుకపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అనేకమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని... విద్యార్థులకు ఆ పరిస్థితి రాకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com