వరదలు కాదు... చిరంజీవి ముఖం పెట్టుకోలేదు... పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఇసుక కొరతకు వరదలు కారణం కాదన్న పవన్ కళ్యాణ్... ఇతర రాష్ట్రాల్లో వరదలు ఉన్నప్పటికీ అక్కడ ఇసుక కొరత లేదని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: November 4, 2019, 5:58 PM IST
వరదలు కాదు... చిరంజీవి ముఖం పెట్టుకోలేదు... పవన్ కళ్యాణ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్
  • Share this:
ఇసుక కొరతతో పాటు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీర్చేంతవరకు జనసేన పోరాటం ఆగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు జనసేన శ్రేణులు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఇసుక కొరతకు వరదలు కారణం కాదన్న పవన్ కళ్యాణ్... ఇతర రాష్ట్రాల్లో వరదలు ఉన్నప్పటికీ అక్కడ ఇసుక కొరత లేదని వ్యాఖ్యానించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. వైసీపీకి ప్రజలు రికార్డ్ స్థాయిలో మెజార్టీ కట్టబెట్టారని... అలాంటి వాళ్లు ప్రజల సమస్యలు పట్టించుకోవడం బాధగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

రెండు వారాల్లో తరువాత కూడా ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోతే... అప్పుడు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే సరి చేయాలని... కానీ మొత్తం వ్యవస్థనే స్తంభింపజేస్తామంటే ఎలా అని వ్యాఖ్యానించారు. తాను సినిమాలు చేయడంలో తప్పేమీ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మంత్రి అవంతి, ముఖ్యమంత్రి జగన్ తమ వ్యాపారాలు ఆపేశారని అని వ్యాఖ్యానించారు. తాను చిరంజీవి కారణంగానే ఎదిగానని కొందరు విమర్శిస్తున్నారని... తాను చిరంజీవి ముఖం పెట్టుకుని నటించలేదని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. తనను విమర్శిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్... ఒకప్పుడు తన చుట్టూ ఎంతగా తిరిగారో అందరికీ తెలుసని అన్నారు.First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...