అలా చేస్తే మట్టిలో కలిసిపోతారు... పవన్ కళ్యాణ్ వార్నింగ్

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: November 13, 2019, 3:48 PM IST
అలా చేస్తే మట్టిలో కలిసిపోతారు... పవన్ కళ్యాణ్ వార్నింగ్
పవన్ కళ్యాణ్
  • Share this:
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌ గ్లోబల్‌ భాషే అయినా.. మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దని ఆయన కోరారు. రాజకీయ నాయకులకు తెలుగు భాష, సంస్కృతిపై ప్రేమలేదని తెలిపారు. తెలుగు ఉనికిని చంపేసే ప్రయత్నం చేస్తే మట్టిలో కలిసిపోతారని వ్యాఖ్యానించారు. ఆంగ్లం అవసరమే కానీ తెలుగు ఉండి తీరాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. ఇంగ్లీష్‌ అవసరమే కానీ సంస్కృతిని విడిచిపెట్టకూడదని అన్నారు. తమిళ భాష కోసం తమిళనాడు మొత్తం ఏకమైందని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు.






First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు