టీడీపీ ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు నింపిన పవన్ కళ్యాణ్

మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే... ఏపీలో అధికారం దక్కడం ఖాయమనే భావనలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు... ఇప్పుడు పార్టీ మారితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునే ఛాన్స్ కోల్పోతామని యోచిస్తున్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 12:55 PM IST
టీడీపీ ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు నింపిన పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏపీలోని అధికార వైసీపీని టార్గెట్ చేయడంలో టీడీపీ కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. రోజూ ఏదో ఒక రకంగా వైసీపీ, ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని తాము ధీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు రేకెత్తించాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గర కాగా... మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో పయనిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అలా పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యే వెనకడుగు వేసేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తాను తెలుగుదేశం, బీజేపీలతో కలిసి పోటీచేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించేందుకు మళ్లీ తమతో కలిసి వస్తారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే... ఏపీలో అధికారం దక్కడం ఖాయమనే భావనలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు... ఇప్పుడు పార్టీ మారితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునే అవకాశం కోల్పోతామనే భావనలో ఉన్నారని టాక్. తాము వైసీపీలోకి వెళితే... తమ సీటు తమకు ఉంటుందనే గ్యారంటీ లేదనే ఫీలింగ్‌లో కొందరు ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పాటు పలు ఇతర కారణాలు టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ వెపు వెళ్లకుండా అడ్డుకోగలిగాయని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>