బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 2:47 PM IST
బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్
  • Share this:
బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్... అదే జరిగి ఉంటే... వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణాదిలో దేశానికి రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారని.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని అన్నారు. తెలుగు భాషను పరిరక్షించమంటే వైసీపీ వక్రీకరిస్తోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Published by: Kishore Akkaladevi
First published: December 4, 2019, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading