జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్... పర్సనల్‌గా టార్గెట్ చేయడంపై ఫైర్

Pawan Kalyan meeting | జగన్ మోహన్ రెడ్డిని తాను పాలసీల మీద విమర్శిస్తే, వారు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: March 14, 2019, 6:42 PM IST
జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్... పర్సనల్‌గా టార్గెట్ చేయడంపై ఫైర్
పవన్ కల్యాణ్, జగన్
news18-telugu
Updated: March 14, 2019, 6:42 PM IST
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. బీసీల మహాసభలు పెట్టి వారి కోసం ప్రత్యేకంగా వరాలు ప్రకటించడం తనకు రాదన్నారు. జనసేన పార్టీ బీసీ సభలు పెట్టదని స్పష్టం చేశారు. జనసేన ప్రకటించిన 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బీసీలకు అండగా ఉన్నామన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన పార్టీ ఐదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కడప పార్లమెంట్ సీటు బీసీకి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పులివెందుల అసెంబ్లీ సీటు బీసీకి ఇవ్వగలరా అని నిలదీశారు. జగన్ తన కుటుంబాన్ని కాదని వేరే వారికి సీట్లు ఇవ్వగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డిని తాను పాలసీల మీద విమర్శిస్తే, వారు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ఏమీ అనలేక పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని పవన్ అన్నారు. తనను పర్సనల్‌గా టార్గెట్ చేయడానికి ‘వేల కోట్లు దోచామా? కులాల పేరుతో వేరు చేశామా? కుటుంబ పాలన చేశామా?’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘నా వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకేం తెలుసు’ అంటూ జగన్‌ను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు