బర్త్‌డేకు దూరంగా పవన్ కల్యాణ్... కారణం చెప్పిన నాగబాబు..

హంగు ఆర్భాటాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారని అన్నారు. ఐనప్పటికీ తన తరపున పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు నాగబాబు.

news18-telugu
Updated: September 2, 2019, 6:28 PM IST
బర్త్‌డేకు దూరంగా పవన్ కల్యాణ్... కారణం చెప్పిన నాగబాబు..
పవన్ కళ్యాణ్ నాగబాబు ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. జనసేనాని ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ సారి వినాయక చవితి రోజే పవన్ బర్త్ డే రావడంతో మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు సినీ స్టార్లు, అటు పొలిటికల్ లీడర్లు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ జనసేన అధినేత మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అసలు పుట్టిన రోజునే జరుపుకోవడం లేదు. ఇప్పుడే కాదు ప్రతి సారీ అంతే..! బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ఆయన దూరంగా ఉంటారు. ఐతే దీనికి ఆయన సోదరుడు నాగబాబు కారణం చెప్పారు. పవన్ బర్త్‌డేను ఎందుకు జరుపుకోరో వెల్లడించారు.


వినాయక చవితితో పాటు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు వీడియో ద్వారా మెగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి రూ.100 కోట్ల విరాళాలు అందించాలని జనసైనికులు లక్ష్యంగా పెట్టుకున్నారని.. రికార్డు స్థాయిలో జనసేన ఖాతాలోకి డబ్బులను జమచేశారని ప్రశంసించారు. ఇలాంటి కార్యకర్తలు ఉండడం తనను భావోద్వేగానికి గురిచేసిందన్నారు నాగబాబు. వారిలో ఓడిపోయామన్న నిరాశ ఎక్కడా కనిపించలేదని..యుద్ధంలో ఓడిపోయిన సైనికులు కనిపించారని కొనియాడారు. ఇలాంటి వాళ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరన్నారు మెగా బ్రదర్. ః

అనంతరం పవన్ కల్యాణ్ పుట్టిన రోజుపై మాట్లాడిన నాగబాబు...సాధారణంగా పవన్ బర్త్‌డేలు చేసుకోడని తెలిపారు. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకోవడం అతడికి ఇష్టం ఉండదని వెల్లడించారు. హంగు ఆర్భాటాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారని అన్నారు. ఐనప్పటికీ తన తరపున పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు నాగబాబు.
First published: September 2, 2019, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading