జగన్ తెచ్చిన పథకమే.. ఎందుకు కొనసాగట్లేదు?.. ‘వకీల్ సాబ్’ లా పాయింట్...

జగన్ ప్రభుత్వం తెచ్చిన లా నేస్తం పథకం ఎందుకు కొనసాగించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: July 5, 2020, 10:55 PM IST
జగన్ తెచ్చిన పథకమే.. ఎందుకు కొనసాగట్లేదు?.. ‘వకీల్ సాబ్’ లా పాయింట్...
వకీల్ సాబ్ పాత్రలో పవన్ (Fan Made Poster/Photo)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ‘లా నేస్తం’ పథకాన్ని ఎందుకు ఆపేశారని వకీల్ సాబ్ గా త్వరలో వెండితెరపై కనిపించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కరోనా మహమ్మారి వల్ల అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో పాలకులు సహృదయంతో స్పందించి ఉన్న పథకాలను కొనసాగిస్తూ సక్రమంగా నిధులు విడుదల చేయన్నారు. కానీ, కరోనా కష్టకాలం వచ్చిన తర్వాత ‘లా నేస్తం’ పథకం ఎందుకు నిలిచిపోయిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. న్యాయవాదుల సంక్షేమ నిధి ఏమైందో న్యాయవాదులకే అర్థం కావడం లేదన్నారు. న్యాయశాస్త్రం అభ్యసించిన లాయర్లు అందరి పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదన్నారు. ఎక్కువ మందికి చాలీచాలని సంపాదనే వస్తుందని చెప్పారు. కరోనా ప్రభావంతో మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు విరామం ప్రకటించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

‘జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు ఇచ్చే లా నేస్తం పథకం కొనసాగి ఉంటే వారికి ఈ కష్టకాలంలో భరోసాగా ఉండేది. గత నాలుగు నెలలుగా ఎందుకు నిర్వహించం లేదు. ఈ ఆర్థిక సాయం ఎందుకు చేయడంలోదో ప్రభుత్వం న్యాయవాదులకు చెప్పాల్సిన అవసరం ఉంది. లా నేస్తం నిధులు ఆపేయడం సమంజసం కాదు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు ఇస్తామన్నారు. జీవో ఇచ్చినా కానీ, ఇంత వరకు నిధులు విడుదల కాలేదు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులను బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తనకు ఓ వినతిపత్రం పంపించారని పవన్ చెప్పారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలన్నారు. జూనియర్, సీనియర్ అనే బేధభావం లేకుండా నెలకు రూ.10వేల చొప్పున ఆరు నెలల పాటు సాయం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 5, 2020, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading