జగన్ ప్రభుత్వం ముందు పవన్ కళ్యాణ్ మరో కొత్త డిమాండ్..

ఏపీలో మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.

news18-telugu
Updated: March 26, 2020, 11:14 PM IST
జగన్ ప్రభుత్వం ముందు పవన్ కళ్యాణ్ మరో కొత్త డిమాండ్..
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతుల్లో నష్టాల పాలవుతామనే తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు. వారిని ఆదుకొనే దిశగా వైసీపీ నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే, స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సంఘాల సభ్యుల వేదనను తగ్గించాలని కోరారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్లిష్ట తరుణంలో కేసీఆర్ నేతృత్వంలో సమర్థంగా పని చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆఆర్కు అభినందనలు తెలిపారు.

అలాగే, కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర తరుణంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనేలా ఈ ప్యాకేజీ ఉందని చెప్పారు. ఇదే సమయంలో ఉద్యోగ వర్గాలకు, స్వయం ఉపాధి పొందేవారికి ఉపశమనం కలిగించేలా నెలవారీ EMI చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు