ఒకే వేదిక‌పై అమిత్ షా, ప‌వ‌న్ ...... తెలంగాణ‌లో భారీ స‌భ‌కు బీజేపీ ప్లాన్

మరో వైపు బీజేపీతో పవన్ అధికారికంగా చేయి కలిపిన తరువాత జ‌ర‌గ‌బోతున్న, మొద‌టి సభ ఇదే కావ‌డంతో అందరిల్లో ఆసక్తి నెలకుంది.

news18-telugu
Updated: February 19, 2020, 10:51 AM IST
ఒకే వేదిక‌పై అమిత్ షా, ప‌వ‌న్ ...... తెలంగాణ‌లో భారీ స‌భ‌కు బీజేపీ ప్లాన్
పవన్ కల్యాణ్, అమిత్ షా
  • Share this:
దేశ‌వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా గ‌ట్టి వాయిస్ వినిపిస్తోన్న నేప‌థ్యంలో బీజేపీ దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక‌లు రెడీ చేసింది. మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన లేక‌పోవ‌డం ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ ఇదే అంశాన్ని ఆస‌ర‌గా చేసుకుని నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేయిస్తోంది బీజేపీ అభ్రిప్రాయ‌డుతుంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రుల‌కు మోడీ స్ప‌ష్ట‌మైన దిశ నిర్దేశం చేసిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులంద‌రు ముఖ్యంగా సీఏఏ పై ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యతిరేక‌త వ‌స్తోంది ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఇప్ప‌ట‌కే మోడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో బీజేపీ తెలంగాణలో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.  అమిత్ షా తో పాటు కొద్ది రోజుల క్రిత‌మే ఎన్డీయేలో చేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఈ స‌భ‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీఏఏపై స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తోన్న నేప‌ధ్యంలో ఈ స‌భ‌తో కేసీఆర్ కామెంట్స్ కు కూడ చెక్ పెట్ట‌డానికి బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

వ‌చ్చే నెల మొద‌టి వారంలో హైద‌రాబాద్ వేదిక‌గా స‌భ‌ నిర్వహించాలని బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా ఈ వేదిక పై క‌ల‌వ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. జాతీయ అధ్యక్షుడిగా షా తెలంగాణ పర్యట‌న ఉంటుంద‌ని భావించినా, అది వాయిదా ప‌డ‌టంతో హోంశాఖ మంత్రి హోదాలోనే అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంద. దేశవ్యాప్తంగా ఆందోళ‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న సీఏఏపై అనుమానాలు తొల‌గించేందుకు, రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేయ‌బోయే భారీ సభలో ఆయ‌న పాల్గొంటార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ స‌భ సంద‌ర్భంగా ఆయన ఎలాంటి ప్రసంగం చేయ‌బోతున్నార‌న్నది సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోతుంది. దీంతో పాటు అమిత్ షా పార్టీ అద్య‌క్షడి హోద నుంచి త‌ప్పుకున్న త‌రువాత న‌డ్డ ఆద్వ‌ర్యంలో వ‌చ్చిన ఢిల్లీ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ ఓడిపోవ‌డంతో అదిష్టానం సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీకి అవ‌కాశం ఉన్న‌చోట్ల పార్టీని ప‌టిష్ఠం చేయ‌డానికి పార్టీ పెద్ద‌లు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ స్థానాలు ద‌క్కించుకున్న బిజేపీకి ఇక్క‌డ టీఆర్ఎస్ కి గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల పార్టీగా ఎద‌గ‌డానికి ఇది ఒక అవ‌కాశంగా పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

తాజాగా, సీఏఏ వ్యతిరేకంగా తెలంగాణ కేబినేట్ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఎండ‌గ‌డుతూ స‌భ పెడితే, అందుకు అమిత్ షా వస్తే, పోలరైజేషన్‌తో, పార్టీ మూలాలు మరింత బలపడతాయని భావిస్తోంది రాష్ట్ర నాయకత్వం. అందుకే భారీ ఎత్తున సీఏఏ అనుకూల సభను నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ స‌భ‌లో, అమిత్ షాతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ సైతం పాల్గొనబోతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మరో వైపు బీజేపీతో పవన్ అధికారికంగా చేయి కలిపిన తరువాత జ‌ర‌గ‌బోతున్న, మొద‌టి సభ ఇదే కావ‌డంతో అందరిల్లో ఆసక్తి నెలకుంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఎంఐఎంతో పాటు ఇత‌ర ముస్లిం సంఘాలు నిర్వహించిన స‌భ‌లు విజ‌య‌వంతం కావ‌డంతో, ఈ స‌భ‌కు భారీగా జ‌నస‌మీక‌ర‌ణ చేసి స‌క్సెస్ చెయ్యాలని తెలంగాణ కమలం పార్టీ నేతలు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు