బీరుట్ కంటే విశాఖలో 8 రెట్లు ఎక్కువ అమ్మోనియం... పవన్ కళ్యాణ్ ఆందోళన..

దేశం మొత్తం అవసరాల కోసం అమ్మోనియం విశాఖలోనే దిగుమతి అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: August 9, 2020, 5:12 PM IST
బీరుట్ కంటే విశాఖలో 8 రెట్లు ఎక్కువ అమ్మోనియం... పవన్ కళ్యాణ్ ఆందోళన..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిగిన అమ్మోనియం పేలుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. అయితే, అక్కడ కంటే ఎక్కువ నిల్వలు విశాఖలో ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘విశాఖ ఒడిలో నిప్పుల కుంపటి’ పేరుతో ఆయ ఓ ప్రకటన జారీ చేశారు. ‘ప్రమాదంలో 2750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు పేలాయి... అయితే మన పోర్టు నగరమైన విశాఖపట్నంలో ప్రస్తుతం సుమారు 19500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు వున్నాయి. అంటే సుమారుగా ఎనిమిది రెట్లు ఎక్కువ. మరి ఇవి పేలితే..? మన దేశం మొత్తం అవసరాల కోసం అమ్మోనియా నైట్రేట్ రసాయనం విశాఖ ఓడ రేవు ద్వారా మాత్రమే దిగుమతి అవుతోంది. రష్యన్ దేశాల ద్వారా దిగుమతులు జరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన రసాయనం అయినందున కేవలం విశాఖ పోర్ట్ నుంచి మాత్రమే దిగుమతులు జరపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇక్కడ నుంచే దేశమంతటికీ ఈ రసాయనం సరఫరా అవుతోంది. ఏటా సుమారు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు విశాఖ ఓడ రేవులో దిగుమతి అవుతోంది. సరుకును నిల్వ చేయడానికి ఇక్కడ ఏడు గోదాములు వున్నాయి. బీరుట్ ప్రమాదం తరవాత సరుకు ఉన్న గోదాములను అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదమూ జరగలేదని, 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని, అందువల్ల భయాలు వద్దని అధికారులు చెబుతున్నారు. అయితే ‘కీడెంచి మేలెంచాలి’ అంటారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ఈ ప్రకటన విడుదల చేయడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడానికి మాత్రమే ఈ ప్రకటన చేస్తున్నాను.’ అని పవన్ కళ్యాన్ అన్నారు.

lebanon, beirut, lebanon news, beirut blast, beirut explosion, lebanon blast, beirut lebanon, beirut news, lebanon explosion, blast in beirut, beirut country, explosion in beirut, where is lebanon, explosion, blast in lebanon, lebanon country, lebanese, lebanon explosion, lebanon beirut, blast lebanon blast, beirut blast, where is beirut, లెబనాన్ పేలుడు, బీరట్ పేలుడు,
బీరుట్‌లో పేలుళ్లు (credit - twitter)


‘బీరుట్ లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవు. మరి ప్రమాదం ఎలా జరిగింది? పేలుడు ఎందుకు సంభవించిందో మన అధికారులు ఆలోచించాలి. ఒకే చోట ఇంత మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి గల అవకాశాలను అన్వేషించాలి. ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చాల సీరియస్ గా తీసుకోవాలి. ఉదాసీనత వహిస్తే, జరగరానిది జరిగితే నష్టం అంచనా వేయడానికి కూడా ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది. విజయవాడ శివారు కొండపల్లిలో కూడా వంద టన్నుల అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. నగరాలు, జనావాసాలు మధ్య ఈ రసాయనాన్ని నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళన సహేతుకంగానే కనిపిస్తోంది. షిప్‌యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్‌పీసీఎల్ సమీపంలోనే అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నారని, అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదని విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ సైతం హెచ్చరిస్తున్నారు. నిల్వ చేస్తున్న గోదాముల దగ్గర తగిన పర్యవేక్షణ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెల మీద నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ నగరం రక్షణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని పవన్ అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading