AP Elections 2019: ఏపీలో మహిళల ఓటు బ్యాంకు ఎక్కువగా వుందని భావించిన చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం ద్వారా మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఘోర పరాభవం ఎదురు చూస్తోంది. ఆసరా పెన్షన్లు, పసుపు-కుంకుమ పథకాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. అయితే, ఓటర్లు ఆ పార్టీ పథకాలకు ఆకర్షితులు కాలేకపోయారు. ఏపీలో మహిళల ఓటు బ్యాంకు ఎక్కువగా వుందని భావించిన చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం ద్వారా మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సఫలం అయ్యిందని మహిళలు చంద్రబాబును ఆశీర్వదించారని టీడీపీ నేతలు భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఆ పథక ప్రభావం ఏ మాత్రం లేదని తేల్చి చెప్పేశాయి. అటు ఆసరా పెన్షన్లు కూడా చంద్రబాబుకు ప్లస్ కాలేకపోయింది.
అలాగే 50 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ పథకం’ కింద రూ.9 వేలు, రూ.15 వేల చొప్పున టీడీపీ సర్కారు పెట్టుబడి సాయం ప్రకటించింది. దీనిలో పట్టాభూముల రైతులకు ఇప్పటికే 2 విడతలుగా రూ.4 వేలు జమ చేసింది. కౌలు రైతులకు ఖరీఫ్ సీజన్లోగా పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఏపీ ఓటర్లు చంద్రబాబును దీవించలేదు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.