17వ లోక్‌సభ.. 17 నుంచే పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ (image: Getty Images)

జూన్ 19న కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

 • Share this:
  భారత పార్లమెంట్ సమావేశాలు జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన ఎంపీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం జూన్ 19న కొత్త స్పీకర్2ను ఎన్నుకొంటారు. ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్ అయిన మేనకాగాంధీని ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 16వ లోక్‌సభలో స్పీకర్‌గా సుమిత్రా మహాజన్‌కు అవకాశం దక్కింది. ఈ సారి ఆమె పోటీ చేయలేదు. అంతకు ముందు 15వ లోక్‌సభ కాలంలో కూడా స్పీకర్‌గా మీరా కుమార్ వ్యవహరించారు. దీంతో వరుసగా మూడోసారి కూడా మహిళకే స్పీకర్ పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.

  జూన్ 19న కొత్త స్పీకర్ ఎన్నిక
  జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
  జూలై 4న ఎకనామిక్ సర్వేను సభలో సమర్పిస్తారు
  జూలై 5న 2019వ సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు
  First published: