Parliament Sessions: పార్లమెంట్‌పై కరోనా ఎఫెక్ట్, వారం ముందే నిరవధిక వాయిదా

ప్రస్తుత పార్లమెంటు భవనం

వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదం పొందాయని పేర్కొంటూ.. వాటిని తిప్పి పంపాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కోరారు విపక్ష నేతలు.

  • Share this:
    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ముందే నిరవధిక వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మధ్యాహ్నమే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడగా.. తాజాగా లోక్‌సభ సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. లోక్‌సభలో ఈ పది రోజుల్లో కొత్తగా 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. మొత్తం 10 సిట్టింగ్‌లలో 25 బిల్లులను ఆమోదించింది.

    వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదం పొందాయని పేర్కొంటూ.. వాటిని తిప్పి పంపాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కోరారు విపక్ష నేతలు. బిల్లులను ఆమోదిస్తూ సంతకం చేయొద్దని కోరారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ నేతృత్వంలోని విపక్ష సభ్యుల బృందం రాష్ట్రపతిని కలిసి ఈమేరకు విజ్ఞాపన పత్రం అందజేసింది. బిల్లుల ఆమోదానికి ముందు అన్ని పార్టీలు, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చించాల్సిందని అన్నారు ఆజాద్​. విపక్షాల ఆందోళనల నడుమ రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020ను పార్లమెంటు ఆమోదించింది. రాజ్యసభలో బిల్లు ఆమోదం సమయంలో ఎనిమిది మంది సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని... వారిపై సస్పెన్షన్ వేటు వేశారు ఛైర్మన్​. ఈ చర్యను ఖండించిన విపక్షాలు పార్లమెంటు సమావేశాలను మంగళవారం బహిష్కరించాయి.

    ఈ పది రోజుల సమావేశాలు ఫలప్రదంగా సాగాయని ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 25 బిల్లులు ఎగువ సభ ఆమోదం పొందినట్లు తెలిపారు. మరో ఆరు బిల్లులు పెద్దల సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. కీలక బిల్లులకు ఆమోదంకరోనా వేళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. కీలక బిల్లులను పార్లమెంట్ గడప దాటించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులతో పాటు పలు బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలోనే ఏడు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. బుధవారమూ అదే స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిధి నుంచి కొంత మొత్తాన్ని విత్​డ్రా చేసుకునేందుకు అధికారం కల్పించే రెండు ద్రవ్య బిల్లులను(అప్రాప్రియేషన్ నెం.3, నెం.4) రాజ్యసభ తిరిగి దిగువ సభకు పంపించింది. సెప్టెంబర్ 19న లోక్​సభలో పాసైన ఈ బిల్లులపై పెద్దల సభ ఎలాంటి చర్చ జరపకుండానే వెనక్కి పంపింది.

    రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులలో కొన్ని

    రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
    రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
    నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు-2020
    బ్యాంకింగ్​ రెగ్యులేషన్​ సవరణ బిల్లు
    కంపెనీల చట్ట సవరణ బిల్లు-2020
    ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020
    ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్ 2020
    కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020
    Published by:Ashok Kumar Bonepalli
    First published: