హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీ ప్రజలకు సేవ చేస్తా.. వైసీపీ రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ

ఏపీ ప్రజలకు సేవ చేస్తా.. వైసీపీ రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ

సీఎం జగన్‌తో పరిమళ్ నత్వానీ

సీఎం జగన్‌తో పరిమళ్ నత్వానీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు పరిమళ్ నత్వానీ ప్రకటించారు.

ప్రముఖ వ్యాపారవేత్త, రెండుసార్లు రాజ్యసభసభ్యుడిగా సేవలు అందించిన పరిమళ్ నత్వానీ వైసీపీ ఎంపీగా మూడోసారి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున విజయం సాధించారు. ఆయనకు 38 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనతో పాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులతో కలసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నత్వానీ మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీకి కృతజ్ఞతలు. జగన్ సీఎం అయిన ఏడాదిలోనే తాను ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లగలరని విశ్వసిస్తున్నా. మా సీఎం నవరత్నాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు పరిమళ్ నత్వానీ ప్రకటించారు. ‘ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. ముఖ్యమంత్రితో పాటు ఆయన బృందంతో కలసి రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేయనున్నాం. జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా నా 12 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో దశాబ్దాల నా అనుభవాన్ని దీని కోసం వినియోగించనున్నాన.’ అని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నారని నత్వానీ అన్నారు. కానీ వాటన్నిటినీ ఆయన అధిగమించగలిగారన్నారు. ‘ప్రజలకు నాయకత్వం వహించడంలో జగన్ ఓ మార్గం సృష్టించారు. కేవలం ఏపీకే కాదు దేశానికి, దక్షిణ భారత దేశానికి నాయకత్వం వహించగల సామర్థ్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఏపీ, దక్షిణ భారత రాజకీయాల్లో రాబోయే కాలంలో జగన్ ఓ బలీయమైన శక్తిగా నిలుస్తారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం, వైసీపీతో కలసి పనిచేయడం నాకు లభించిన ఓ వరంగా భావిస్తున్నా’ అని పరిమళ్ నత్వానీ చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Parimal Nathwani

ఉత్తమ కథలు