హోమ్ /వార్తలు /రాజకీయం /

Parimal Nathwani | ఏపీ నుంచి రాజ్యసభకు పరిమళ్ నత్వానీ నామినేషన్... బయోడేటా..

Parimal Nathwani | ఏపీ నుంచి రాజ్యసభకు పరిమళ్ నత్వానీ నామినేషన్... బయోడేటా..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పరిమళ్ నత్వానీ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పరిమళ్ నత్వానీ

Parimal Nathwani | పరిమళ్ నత్వానీ జార్ఖండ్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి ఆయన 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడి కొనసాగారు.

ప్రముఖ వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన రెండుసార్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి ముందుకు రావడంతో నత్వానీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నత్వానీ మీడియాతో మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డికి ఎంత ఆదరణ ఉందో తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ అధిగమించి ప్రజల ఆశీర్వాదంతో గత ఏడాది ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తాను కృషి చేస్తానని చెప్పారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డితో పరిమళ్ నత్వానీ (ఎడమ చివర)

పరిమళ్ నత్వానీ జార్ఖండ్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి ఆయన 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడి కొనసాగారు. ఎంపీ ల్యాడ్ నిధులు, సాంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దాదాపు వంద శాతం నిధులను అభివృద్ధికి ఖర్చు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, పరిశుభ్రత, నైపుణ్యాభివృద్ధికి ఆయన తన ఎంపీ ల్యాడ్, ఇతర నిధులను వినియోగించారు. మూడు గ్రామాలను (బరాం - జరాతోలి, చుట్టు, బర్వాదాగ్) దత్తత తీసుకుని వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు.

పరిమళ్ నత్వానీకి బీఫాం అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోర్ టీమ్‌లో పరిమళ్ నత్వానీ కూడా ఒకరు. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీని తన మెంటార్‌, రోల్ మోడల్‌గా చెబుతారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రిఫైనరీ కాంప్లెక్స్ నిర్మాణంలో పరిమళ్ నత్వానీ కీలక భూమిక పోషించారు. పశ్చిమ భారత దేశంలో రిలయన్స్ పెట్రోల్ రిటైల్ ఔట్‌లెట్స్, గ్యాస్ రవాణా పైప్‌లైన్, జియో మొబైల్ నెట్ వర్క్ విస్తరణలో ఆయన పాత్ర కీలకం.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శాలువా కప్పుతున్న పరిమళ్ నత్వానీ

యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తి ఉన్న పరిమళ్ నత్వానీ తన సొంత నియోజకవర్గం జామ్ కంబాలియా నుంచి అసెంబ్లీకి పోటీ కూడా చేశారు. ప్రజా సేవ, ప్రజా సమస్యలను వివిధ వేదికల మీద వినిపిచే ఆయనకు ‘వాయిస్ ఆఫ్ సౌరాష్ట్ర’ అనే బిరుదు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా నత్వానీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరా నిర్మాణంలో పునాది రాయి నుంచి కూడా ఆయన పర్యవేక్షణలో సాగింది. 2019 మధ్యంలో ఆయన గుజరాత్ ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఎన్నికయ్యారు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులతో సీఎం వైఎస్ జగన్

గుజరాత్‌లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించిన బిజిసెస్ డెలిగేషన్‌లో పరిమళ్ నత్వానీ కూడా ఒకరు. చైనా, జపాన్, రష్యా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, ఉగాండా, కెన్యా సహా సుమారు 12, 13 దేశాల్లో ఆయన పర్యటించారు. వైబ్రంట్ గుజరాత్ ‌లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలతో సత్సంబంధాలు నెలకొన్నాయి.

గుజరాత్‌లోని ద్వారకాదీష్ ఆలయ ట్రస్ట్‌కు సుమారు 15 సంవత్సరాలుగా వైస్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయ బోర్డులో 9 సంవత్సరాలుగా సభ్యుడిగా కొనసాగుతున్నారు. ‘గిర్ లయన్ - ప్రైడ్ ఆఫ్ గుజరాత్’, ‘జార్ఖండ్ మేరీ కర్మభూమి’ అనే పుస్తకాలు పరిమళ్ నత్వానీ శక్తిసామర్థ్యాలను తెలియజేస్తాయి. జార్ఖండ్ అభివృద్ధికి పరిమళ్ నత్వానీ చేసిన సేవలకు గాను ఆయనపై రాసిన ‘అడోరబుల్ అండ్ అడ్మైరబుల్ పరిమళ్ నత్వానీ’ అనే పుస్తకం త్వరలోనే టైమ్స్ ఆఫ్ ఇండియా (రాంచీ) విడుదల చేయబోతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Parimal Nathwani, Rajya Sabha

ఉత్తమ కథలు