Home /News /politics /

PANCHAYAT ELECTIONS COUNTING IS GOING ON IN ANDHRA PRADESH AND YSRCP SUPPORTERS WINNING IN MAJORITY PANCHAYATS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. స్వగ్రామంలో మాజీ మంత్రికి షాక్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) కౌంటింగ్ కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) గెలుపొందుతుండగా.. కొన్నిచోట్ల తెలుగుదేశం (Telugu Desham party) గట్టిపోటీనిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపొందుతుండగా.. కొన్నిచోట్ల తెలుగుదేశం గట్టిపోటీనిస్తోంది. తమకు పట్టున్న ప్రాంతాల్లో జనసేన మద్దతుదారులు ప్రభావం చూపిస్తున్నారు. పలు పంచాయతీల్లో అనూహ్య ఫలితాలు కూడా వస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి షాక్ తగిలింది. బండారు స్వగ్రామమైన వెన్నెలపాలెంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బండారు సతీమణి వాణి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి హ్యండిచ్చిన ఓటర్లు..వైసీపీ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తుండగా ఇప్పుడు తొలిసారిగా ఇతర పార్టీ మద్దతుదారుడు విజయం సాధించారు.

    వైసీపీ బలపర్చిన అభ్యర్థి వెన్నెల అప్పారావు 663 ఓట్లతో టీడీపీ మద్దతుదారుడిపై విజయం సాధించారు.

    రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంమైన చంద్రబాబు స్వగ్రామమైన కందులవారిపల్లె పంచాయతీలో టీడీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె.. కందులవారిపల్లె పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గ్రామంలో 10 వార్డులుండగా.. 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా.. 8 వార్డుల్లోనూ టీడీపీ మద్దతుదారులే విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన బొబ్బా లక్ష్మి 563 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కందులవారిపల్లె పంచాయతీని కైవసం చేసుకొని చంద్రబాబుకు షాకివ్వాలని వైసీపీ యత్నించినా ఓటర్లు మాత్రం టీడీపీకి అనుకూలంగా తీర్పునిచ్చారు.

    మరోవైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజోలులో జనసేన బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. రాజోలులో ఇప్పటివరకు దాదాపు 20 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలిచినట్లు తెలుస్తోంది. పడమటిపాలెం, టెకిశెట్టిపాలెం, కేశవాదాసుపాలెం, కాట్రేనిపాడు, ఈటుకూరు, మేడిచర్ల పాలెం, బట్టేలంక, రామరాజులంక, కత్తిమండ, కూనవరం పంచాయతీల్లో జనసేన విజయం సాధించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Gram Panchayat Elections, Janasena, Janasena party, Local body elections, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు