Andhra Pradesh: గెలిచినా అధికారం ఇవ్వలేదు... ఏపీలో సర్పంచుల వింత బాధ

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections) ముగిసి 20 రోజులు దాటింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు గ్రామ సర్పంచులు అయ్యారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసి 20 రోజులు దాటింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు గ్రామ సర్పంచులు అయ్యారు. ఐతే వారంతా బాధ్యతలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా ముహూర్తం ఖరారు చేయకపోవడంతో డీలా పడుతున్నారు. గెలిచినా అధికారం దక్కకపోయే సరికి అసంతృప్తితో ఉన్నారు. పల్లెల్లో ఎన్నికలు ముగిసినా నేటికీ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. ఐతే ఇప్పటికే సర్పంచులకు, వార్డు సభ్యులకు స్టేజ్ వన్ అధికారులు ఫారం-29 ఇవ్వడంతో తామంతా అధికారంలో ఉన్నట్లే భావిస్తున్నారు. పంచాయతీల్లో ఎన్నికైన నూతన పాలకవర్గాలకు అధికారాలు అప్పగించకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని సర్పంచులు చెప్తున్నారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ తేదీ నిర్ణయించి సర్పంచులకు అధికారాలు అప్పగించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేస్తే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశముంది.

    ప్రభుత్వం నిర్ణయించిన తేదీనాడు పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు వారంతా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పదవుల్లో కొనసాగుతారు. కానీ ఈలోగానా పాలకవర్గాల నుంచి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిళ్లు పెరిగిపోయాయి. సర్పంచులుగా ఎన్నికైనవారు అక్కడక్కడా నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం, ఆర్ధిక సంఘం నిధులతో పనులు చేపట్టేందుకు సిఫార్సులు చేయడం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ చేయాలో తెలియక అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు.

    ఇది చదవండి: అదే జరిగితే వైసీపీకి కష్టమేనా... టీడీపీకి ప్లస్ పాయింట్ కానుందా...?



    గతంలో రెండు నెలలు
    2013లో చివరిసారిగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి దాదాపు రెండు నెలల తర్వాత అధికారాలు కట్టబెట్టారు. 2013లో జూన్ లో మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. ఆగస్టు 2 నుంచి పాలకవర్గాలు అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్సులున్నాయి. మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలుండటంతో బాధ్యతల స్వీకరణకు కోడ్ అడ్డు వచ్చింది. ఈ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఐతే బాధ్యత స్వీకరణ ఎన్నికల్లో భాగమేనని దీనికి కోడ్ తో పనిలేదని పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

    ఇది చదవండి: ఆన్ లైన్ రమ్మీలో అప్పుల పాలు.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!


    Published by:Purna Chandra
    First published: