• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PANCHAYAT ELECTION OFFICIALS REPLACED SARPANCH CANDIDATES SYMBOL WITH NOTA IN KRISHNA DISTRICT OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పోలింగ్ బూత్ లో కలకలం.. సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల గుర్తు మాయం

AP Panchayat Elections: పోలింగ్ బూత్ లో కలకలం.. సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల గుర్తు మాయం

కృష్ణాజిల్లా నిడమానూరులో సర్పంచ్ ఎన్నికల గుర్తు మాయం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో (Andhra pradsh panchayat Elections) పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... 20,157 వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలో చోటు చేసుకుంటున్నారు. కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 5వ నంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావుకు చెందిన ఎన్నికల గుర్తు మాయమైంది. బ్యాలెట్ పేపర్లో శీలం రంగారావుకు కేటాయించిన వంకాయ గుర్తు స్థానంలో అధికారులు నోటా గుర్తు స్టిక్కర్ అంటించారు

    దీంతో శీలం రంగారావు పోలింగ్ బూత్ వద్ద ఆదోళనకు దిగారు. ఓటర్లు కూడా ప్రశ్నించడంతో షాకైన అధికారులు పొరబాటును సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఐతే పోలింగ్ ముందు పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితా, వారి పేర్లు, గుర్తులకు సంబంధించిన వివరాలన్ని పరిశీలించిన తర్వాతే ఓటింగ్ మొదలవుతుంది. ఇక్కడ ఏకంగా ఓ అభ్యర్థికి చెందిన గుర్తుపై నోటా స్టిక్కర్ అంటించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది కావాలనే చేశారా..? లేక పొరబాటున జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

    మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పొలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి రాష్ట్రంలో 62.02 శాతం పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 70.60 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 54.07 పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 54.88 శాతం, విశాఖలో 65 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 62.14శాతం, కృష్ణాజిల్లాలో 67శాతం, గుంటూరు జిల్లాలో 62 శాతం, ప్రకాశం జిల్లాలో 57 శాతం, నెల్లూరు జిల్లాలో 61శాతం, చిత్తూరు జిల్లాలో 66.33శాతం, కడప జిల్లాలో 61.19శాతం, అనంతపురం జిల్లాలో 63శాతం పోలింగ్ నమోదైంది.
    Published by:Purna Chandra
    First published: