news18-telugu
Updated: September 22, 2019, 3:16 PM IST
మంగళవారం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
యుద్ధం వస్తే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచపటంలోనే ఉండదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాకినాడ జేఎన్టీయూలో ఆర్టికల్ 370 మీద జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఏర్పాటు చేశారని, దాని వల్ల 42 వేల మంది చనిపోయారని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్టికల్ 370 కారణంగా గతంలో పాకిస్తాన్తో నాలుగు యుద్ధాలు జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. కాశ్మీరీ లో 370 కారణంగా మహిళా రిజర్వేషన్లు కాని, ఎస్సీ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండవన్నారు. దేశం కోసం ఏత్యాగమైనా చేస్తామన్నారు. ఈసారి యుద్ధమంటూ వస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నారు. ఇమ్రాన్ ఖాన్ తాటాకుచప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 22, 2019, 3:11 PM IST