ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాల మద్దతు కోరుతున్న పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించవని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్‌కు ఏ దేశం మద్దతునిచ్చే పరిస్థితి లేదన్నారు.పాక్ ఇలాగే భారత్‌ను అస్థిరపరిచే చర్యలకు పాల్పడితే.. ఆ దేశంతో చర్చలు జరిపే పరిస్థితి కూడా ఉండదన్నారు. తాను పాకిస్తాన్‌ను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నానని.. అసలు కశ్మీర్ వాళ్లది ఎప్పుడైందని ప్రశ్నించారు. అసలు కశ్మీర్‌పై మాట్లాడే హక్కు పాకిస్తాన్‌కు లేదన్నారు.భారత అంతర్భాగం అయిన కశ్మీర్ గురించి మాట్లాడే బదులు.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆ దేశం దృష్టిపెడితే బాగుంటుందని చెప్పారు. లడఖ్ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొద్దిరోజుల క్రితం అణు ప్రయోగంపై కూడా రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'అణు ప్రయోగం మొదట భారత్ వైపు నుంచి జరగదు' అన్న
పాలసీ మున్ముందు మారే అవకాశం ఉందన్నారు. తద్వారా భవిష్యత్‌లో శత్రు దేశాలపై భారతే ముందు అణు ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చినట్టయింది.
Published by:Srinivas Mittapalli
First published:August 29, 2019, 13:13 IST