దేనికైనా సిద్ధం ఉన్నాం.. యుద్ధం వస్తేనా.. ఇమ్రాన్‌ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

Imran Khan | Article 370 | Kashmir | యుద్ధం వచ్చే పరిస్థితులు ఎదురైతే దానికి పూర్తి బాధ్యత ఇండియాదేనని, అయితే, అన్నింటినీ ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 14, 2019, 4:52 PM IST
దేనికైనా సిద్ధం ఉన్నాం.. యుద్ధం వస్తేనా.. ఇమ్రాన్‌ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Photo: ANI)
  • Share this:
జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ విషం కక్కుతూనే ఉంది. రద్దు వల్ల యుద్ధం వస్తే దానికి బాధ్యత భారత్‌దే అవుతుందని కారుకూతలు కూస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ వ్యూహాత్మక తప్పిదం చేశారని, దీనివల్ల ఆ దేశం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించారు. యుద్ధం వచ్చే పరిస్థితులు ఎదురైతే దానికి పూర్తి బాధ్యత ఇండియాదేనని, అయితే, అన్నింటినీ ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇక, పీవోకేలో భారత్ ఏ చిన్న చర్యకు పాల్పడినా.. అంతకు పదింతలు దీటుగా జవాబు ఇస్తామని ఆయన వెల్లడించారు. మోదీకి, హిట్లర్‌కు పెద్ద తేడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి కారకులైన నెపోలియన్, హిట్లర్ చరిత్రలో కలిసిపోయారని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు.

కశ్మీర్ సమస్యపై తానే ప్రపంచ రాయబారి అవతారం ఎత్తబోతున్నానని, అన్ని అంతర్జాతీయ వేదికలపై దాన్ని లేవనెత్తుతానని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కోర్టుకు వెళతామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలను కూడగడతామని చెప్పారు. తమ పోరాటానికి మద్దతుగా చరిత్రను మరిపించేలా ప్రజలు కదిలి వస్తారని పాక్ ప్రధాని తెలిపారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు