• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PAKISTAN BASED HACKERS TARGETS PERSONAL WEBSITE OF KISHAN REDDY SK

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి షాక్.. వెబ్‌సైట్ హ్యాక్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్స్

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి షాక్.. వెబ్‌సైట్ హ్యాక్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్స్

కిషన్ రెడ్డి

వెబ్‌సైట్‌లో భారత ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి డేటా లేదని కిషన్ రెడ్డి కార్యాలయం వెల్లడించింది. కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది.

  • Share this:
    కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి పాకిస్తాన్ హ్యాకర్లు షాకిచ్చారు. కిషన్ రెడ్డి పర్సనల్ వెబ్‌సైట్ Kishanreddy.comని పాకిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు (ఆగస్టు 15)న వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు హైదరాబాద్‌లోని కిషన్ రెడ్డి కార్యాలయం వెల్లడించింది. కశ్మీర్ స్వాతంత్ర్యం, పాకిస్తాన్‌కు సంబంధించిన సందేశాన్ని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఘటన జరిగి 15 రోజులవుతున్నా.. ఇప్పటికీ ఆ వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదు. సమస్య పరిష్కారం కోసం సైబర్ నిపుణులు పనిచేస్తున్నారు.

    ఐతే ఈ వెబ్‌సైట్‌లో భారత ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి డేటా లేదని కిషన్ రెడ్డి కార్యాలయం వెల్లడించింది. కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. కిషన్ రెడ్డి రాజకీయ కార్యక్రమాలు, పనులు, ప్రొఫైల్ మాత్రమే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు