• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • PAK FOREIGN MINISTER THREATENS TO BOYCOTT OIC MEETING OVER INVITE TO SUSHMA SWARAJ MS

ఆ సదస్సుకు సుష్మా వస్తే బాయ్‌కాట్ చేస్తాం : పాకిస్తాన్ హెచ్చరిక

ఆ సదస్సుకు సుష్మా వస్తే బాయ్‌కాట్ చేస్తాం : పాకిస్తాన్ హెచ్చరిక

సుష్మా స్వరాజ్, మహమూద్ ఖురేషీ(File)

India Pakistan Conflict : భారత్ తన సోదర దేశం,ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ వ్యవస్థాపకుల్లో ఒకటైన పాకిస్తాన్‌పై పైన తన ప్రతాపం చూపిస్తోందని ఖురేషీ ఆరోపించారు. ఇదే విషయంపై ఐరాస జనరల్ సెకట్రరీ ఆంటోనియో, టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కవుసొగ్లుతో చర్చిస్తామని అన్నారు.

 • Share this:
  పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్(OIC)కి ఓ హెచ్చరిక చేశారు. ఈ వారంలో యూఏఈ వేదిక జరగాల్సి ఉన్న సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరైతే.. పాక్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తుందని హెచ్చరించారు. మార్చి 1-2వ తేదీల్లో అబుదాబీలో జరగనున్న ఈ ఈవెంట్‌కు సుష్మా స్వరాజ్‌ను నిర్వాహకులు అతిథిగా ఆహ్వానించారు.

  ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్(OIC)తో గానీ, వేరే ఇస్లామిక్ దేశంతో గానీ నాకెలాంటి పట్టింపులు లేవు. కానీ భారత విదేశాంగ మంత్రి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సమావేశానికి హాజరవడంపై నేను అభ్యంతరం తెలుపుతున్నాను. ఒకవేళ సుష్మా స్వరాజ్ సమావేశానికి వస్తే.. ఈవెంట్‌కు నేను దూరంగా ఉంటాను.
  మహమూద్ ఖురేషీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి


  భారత్ తన సోదర దేశం,ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ వ్యవస్థాపకుల్లో ఒకటైన పాకిస్తాన్‌పై పైన తన ప్రతాపం చూపిస్తోందని ఖురేషీ ఆరోపించారు. ఇదే విషయంపై ఐరాస జనరల్ సెకట్రరీ ఆంటోనియో, టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కవుసొగ్లుతో చర్చిస్తామని అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సుకు సుష్మా రావడాన్ని టర్కీ విదేశాంగ మంత్రి కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

  బుధవారం రాత్రి యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లాతోనూ ఇదే విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. మరోవైపు పాక్‌లో భారత్ దాడులు జరపగాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ తప్పు పట్టింది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి ఇరువైపులా శాంతి నెలకొనాలంటే ఆ దిశగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది.
  First published:

  అగ్ర కథనాలు