• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PADMARAO GOUD IS THE MAN BEHIND MY MARRIAGE SAYS BALKA SUMAN IN ASSEMBLY MS

పద్మారావు గౌడ్ వల్లే.. అలా నా పెళ్లి జరిగింది : అసెంబ్లీలో బాల్క సుమన్

పద్మారావు గౌడ్ వల్లే.. అలా నా పెళ్లి జరిగింది : అసెంబ్లీలో బాల్క సుమన్

బాల్క సుమన్(File)

Balka Suman on Padmarao Goud : ఉద్యమ సమయంలో ఉస్మానియా వర్సిటీ టీఆర్ఎస్‌వి తరుపున ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా పద్మారావే వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. సభలకు వాహనాలు సమకూర్చడం దగ్గరినుంచి.. తాము జైలుకు వెళ్తే విడిపించడం వరకు అన్నీ తానే చూసుకునేవారని అన్నారు.

  • Share this:
    అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పద్మారావు గౌడ్‌తో తన వ్యక్తిగత అనుబంధం గురించి సభలోని సభ్యులతో పంచుకున్నారు. తన ప్రేమ వివాహానికి పద్మారావు గౌడ్ అన్నీ తానై ముందు నిలిచారని.. ఆయన వల్లే తన వివాహం జరిగిందని చెప్పారు.

    ఈ విషయం సభలో చెప్పవద్దో లేదో నాకు తెలియదు. కానీ పద్మారావు గౌడ్‌తో నా అనుబంధం గురించి చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌వి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు.. నా వివాహానికి మా అత్త మామలు ఒప్పుకోలేదు. నేను ప్రేమించిన అమ్మాయి పద్మారావు సామాజిక వర్గానికే చెందినవారు. ఆ సమయంలో నాకంటూ ఏది లేదు కాబట్టి మా అత్త మామలు పిల్లనివ్వడానికి వెనుకాడారు. దాంతో పద్మారావు అన్ననే వారితో మాట్లాడి ఒప్పించారు.
    బాల్క సుమన్, చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే


    భవిష్యత్తులో సుమన్ ఎమ్మెల్యే అవుతాడని పద్మారావు భరోసా ఇవ్వడంతో తన అత్త మామలు పెళ్లికి ఒప్పుకున్నట్టు సుమన్ తెలిపారు. అంతేకాదు, ఉద్యమ సమయంలో ఉస్మానియా వర్సిటీ టీఆర్ఎస్‌వి తరుపున ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా పద్మారావే వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. సభలకు వాహనాలు సమకూర్చడం దగ్గరినుంచి.. పోలీస్ నిర్భంధంలో తమను వారి కంటపడకుండా దాచిపెట్టడంలోనూ పద్మారావే అండగా నిలిచారని తెలిపారు. పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఇది కూడా చదవండి : తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవం
    First published:

    అగ్ర కథనాలు