Telangana: హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం.. రాజకీయం లాభం కోరుకుంటామన్న కేసీఆర్

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి

Telangana: కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

  • Share this:
    హుజూరాబాద్‌లో రాజకీయ లబ్ది కోసమే దళిత బంధు పథకం మొదలుపెడుతున్నారనే ఆరోపణలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తమది రాజకీయ పార్టీ అని.. రాజకీయ ప్రయోజనం ఆశించడంలో తప్పేముందని ఆయన కుండబద్ధలు కొట్టారు. తమదేమీ సన్నాసుల మఠం కాదని.. తామేమీ హిమాలయాల్లో లేమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాాబట్టే దళిత బంధు పథకం అమలుకానుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే దళిత బంధు కార్యక్రమం ఎంతో గొప్పగా ఉండబోతోందని స్పష్టం చేశారు. దళితులు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా ఉండేలా ఈ పథకం రూపకల్పన చేశామని తెలిపారు. ఈ పథకం పెట్టాలని తనను ఎవరూ కోరలేదని వ్యాఖ్యానించారు.

    హుజూరాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాడి కౌశిక్‌రెడ్డికి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు తాను మార్గం సుగుమం చేస్తానని హామీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. అయితే రాజకీయాల్లో మన ప్రస్థానం కొనసాగాలని సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి సూచించారు.

    తెలంగాణ అనేక రంగాల్లో పురోగమిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. తాము రాష్ట్రంలో ప్రవేశపెట్టే పథకాలు ఆషామాషీగా పెట్టినవి కాదని అన్నారు. గొర్రల పంపకం, రైతు బంధు సహా అనేక పథకాలు గొప్ప పథకాలు అని వ్యాఖ్యానించారు. వాటి ఫలితాలు ఇప్పుడు అందరి ముందు కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ పథకాల ద్వారా తెలంగాణ మరింత ముందుకు వెళుతోందని సీఎం కేసీఆర్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: