Home /News /politics /

PADAYATRA WILL GIVE POWER FROM OPPOSITION PROVED BY YSR CHANDRABABU JAGAN BS

వైఎస్‌ఆర్, జగన్, చంద్రబాబు.. పాదయాత్ర చేస్తే సీఎం పీఠం కదిలి రావాల్సిందే..

పాదయాత్రలో జగన్ (ఫైల్)

పాదయాత్రలో జగన్ (ఫైల్)

2003 ఏప్రిల్ 9న వైఎస్‌ఆర్రం గారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టి 1468 కిలోమీటర్ల మేర కాలినడకన రాష్ట్రమంతా తిరిగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించారు.

  పాదయాత్ర.. ఈ పేరు వినబడితే ఠక్కున గుర్తొచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే. ప్రజాప్రస్థానం పేరుతో ఆయన సంచలనాత్మక రాజకీయాలకు తెర తీశారు. కాదు.. కాదు.. సీఎం పీఠం కదిలి వస్తుందని నిరూపించారు. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉన్న పోరు కొనసాగుతున్న సమయం అది.. ఆ పోరులో తానేంటో నిరూపించేకునేందుకు ఆయన చేపట్టిన పాదయాత్ర దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. 2003 ఏప్రిల్ 9న ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టి 1468 కిలోమీటర్ల మేర కాలినడకన రాష్ట్రమంతా తిరిగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించారు. ఆ దెబ్బకు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోనే తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ తర్వాత 2012 అక్టోబర్ 2న వస్తున్నా నీకోసం అంటూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2340 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా, 2014 ఎన్నిల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.

  ys jagan, ys jagan mohan reddy, ys jagan mohan reddy oath ceremony, ys jagan mohan reddy oath ceremony date fixed, ys jagan oath ceremony date fixed, swami swaroopanandendra, ysrcp, tdp, chandrababu naidu, jagan, ys jagan latest news, ys jagan latest, ys jagan oath ceremony, ap politics, ap elections 2019, ap assembly elections 2019, ap assembly election results 2019, ycp chief ys jagan mohan reddy, వైఎస్ జగన్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం, స్వామి స్వరూపానందేంద్ర, వైసీపీ, టీడీపీ, చంద్రబాబునాయుడు, ఏపీ రాజకీయాలు
  వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)


  2014 ఎన్నికల్లో పరాజయాన్ని మూట గట్టుకున్న వైసీపీ అధినేత జగన్ 2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించి 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తోందని, ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానని అసెంబ్లీకి గుడ్ బై చెప్పి ప్రజల బాట పట్టారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల హామీని పూర్తిగా అమలు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, రాజధాని నిర్మాణంలో అక్రమాలు, ఇసుక దోపిడీ, మైనింగ్‌ అక్రమాలు, యువతకు నిరుద్యోగ భృతి కల్పనలో విఫలం వంటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ జగన్ పాదయాత్రలో దూసుకుపోయారు.

  Padayatra made YS Rajashekar reddy CM of Andhra pradesh, Will it repeat for YS Jagan in 2019 assembly elections వైఎస్ఆర్ ఫార్ములా కలిసొచ్చేనా ? పాదయాత్ర వల్ల వైఎస్ జగన్ సీఎం అవుతారా ? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్రలు చేసిన తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో... వైఎస్ జగన్‌ విషయంలోనూ మరోసారి పాదయాత్ర సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ? అనే ఆసక్తి నెలకొంది.
  పాదయాత్రలో వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)


  దేశచరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా వైయస్ జగన్ అత్యధిక కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 341 రోజుల పాటు 3,648 కిలో మీటర్ల మేర సాగింది. ఆయన మొత్తం 134 నియోజకవర్గాల్లో పర్యటించారు. 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మునిసిపాలిటీలు, 8 కార్పోరేష‌న్ల మీదుగా ఈ యాత్ర సాగించారు. మొత్తం 124 బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్రసంగించారు.

  విశేషమేమిటంటే.. తండ్రీ కొడుకులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఓడించింది చంద్రబాబునాయుడినే. 2004లో వైఎస్‌ఆర్ బాబును ఓడించగా, తాజా ఎన్నికల్లో జగన్ విజయపథంలో దూసుకుపోతున్నారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Telangana, Telangana Lok Sabha Elections 2019, Ys jagan padayatra

  తదుపరి వార్తలు