శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి చిదంబరం కీలక సూచన..

తెల్లవారుజామున 4గంటలకు రాష్ట్రపతిని నిద్రలేపి మరీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను రద్దు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉదయం 9గంటల వరకు ఎందుకు వేచి చూడలేకపోయారని నిలదీశారు.

news18-telugu
Updated: November 27, 2019, 3:34 PM IST
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి చిదంబరం కీలక సూచన..
మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం (File Photo)
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం శుభాకాంక్షలు తెలిపారు. మూడు పార్టీలు కలిపి ఒక కామన్ ఎజెండా ఏర్పరుచుకుని కలిసి పనిచేయాలని సూచించారు.రైతులు,ప్రజాసంక్షేమం,పెట్టుబడులు,నిరుద్యోగం,సామాజిక న్యాయం,మహిళా స్త్రీ సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. మరో ట్వీట్‌లో పరోక్షంగా బీజేపీని ఆయన టార్గెట్ చేశారు. నవంబర్ 26,2019 జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని గుర్తుచేసుకుంటే..నవంబర్ 23 నుంచి నవంబర్ 26వరకు బీజేపీ చేసిన రాజ్యాంగ ఉల్లంఘన చరిత్రలో మిగిలిపోతుందన్నారు. తెల్లవారుజామున 4గంటలకు రాష్ట్రపతిని నిద్రలేపి మరీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను రద్దు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉదయం 9గంటల వరకు ఎందుకు వేచి చూడలేకపోయారని నిలదీశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న చిదంబరం తన కుటుంబం సహాయంతో ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కూటమి తరుపున శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం సాయంత్రం 6.40గంటలకు దాదర్‌లోని శివాజీ పార్కులో ప్రమాణస్వీకారం జరగనుంది.నిజానికి డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయాలని మొదట భావించినప్పటికీ.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు.First published: November 27, 2019, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading