ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తానన్న సీఎం జగన్ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను దుమారమే లేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే జనసేన, టీడీపీ పలు విమర్శలు చేస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కూడా ఇంగ్లీష్ మీడియం అమలుపై స్పందించింది. ఏపీ బీజేపీ ఛీప్ కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తాము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదన్నారు. అయితే భాషా... సంస్కృతిని కాపాడాలన్నారు. భాషను బలవంతంగా రుద్దద్దని కన్నా హితవులు పలికారు.అయితే అలాంటి సమయంలోనే ప్రభుత్వ పరంగా తెలుగుని విస్మరిస్తాం అంటే కుదరదన్నారు. భాషను ఎంచుకొనే ఆప్షన్ విధానం పెట్టాలన్నారు.
ఏపీలో ఇంగ్లీషు బాషా అమలు వెనుక మతపరమైన కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కన్నా. అమ్మకు మమ్మికి మధ్య ఉన్న తేడాతో మొత్తం సంస్కృతి మారిపోతుందన్నారు. ఒక మతాన్ని ప్రోత్సాహించేందుకు ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఎవరు ప్రజా సమస్యలపై పోరాడిన సంఘీభావం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తుందన్నారు కన్నా.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.