OWN PARTY LEADERS GAVE SHOCK TO MLA ROJA BUT HER FOLLOWERS CONFIDENT ABOUT CABNET BERTH NGS BK
MLA Roja: సొంత పార్టీ నేతలతో రోజాకు చిక్కులు.. వారే మంత్రి పదవికి అడ్డుపడుతున్నారా..?
నగరిలో రోజాను టార్గెట్ చేస్తున్న జాతీయ నేత
రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారా..? ఆమెకు ఆ పదవి రాకుండా అడ్డుపడే వారి సంఖ్య పెరిగిందా..? అందులోనూ సొంత పార్టీ నేతలే ఆమెకు అడ్డుపడుతున్నారా..? రోజాకు అడ్డు పడుతున్న ఆ నేతలు ఎవరు.? ఎందుకు అడ్డుపడుతున్నారు..?
M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18 ఏపీ కేబినేట్ విస్తరణ వార్తాలు తెరపైకి వచ్చినప్పటి నుంచి మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవులు ఉంటాయా?ఊడుతాయా? అంటూ సన్నిహితుల దగ్గర పలువురు మత్రులు చర్చలు పెడుతున్నారు. ఇక మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు అయితే.. అధిష్టానం చూపు తమపై పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సారైనా జగన్ తమను కరుణిస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ నుంచి ఎవరు ఇన్.. ఎవరు ఔట్ అనే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి దగ్గర ఒక స్పష్టమైన నివేధిక ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు తమ స్ట్రాటజీ మార్చారు. తమకు మంత్రి పదవి రాకపోయిన పర్వాలేదు.. తమకు పార్టీలో గిట్టని వారికి మాత్రం మాత్రం పదవులు రాకూడదని పావులు కదుపుతున్నారు, తాజాగా ఇదే కోవలో బలైపోయే జాబితాలొ అంబటి రాంబాబు ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మంత్రి వర్గం విస్తరణ ఉందని వార్తలు వచ్చినప్పటి నుంచి అంబటి మంత్రి పదవి పై చాలా ఆశలు పెట్టుకున్నారు. స్వతహాగా మంచి వాగ్ధాటి ఉన్న నేత కావడంతో పార్టీని కీలక సమయాల్లో తన మాటల మాయాజాలంతో ఒడ్డున్న పడేసిన సందర్భలు చాలా ఉన్న నేపధ్యంలో ఈ సారి మంత్రి వర్గంలోకి అంబటికి బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇక్కడ పార్టీలో అంబటి అంటే పడని కొంత మంది నేతలు ఆయన ఆడియోలను లీక్ చేసి మంత్రి పదవి ఆశలపై నీళ్లు పోశారు. ఇప్పుడు రోజా కూడా ఇలాంటి సమస్తే ఎదుర్కొంటోందని టాక్ వినిపిస్తోంది.
రోజాను కాబినేట్ లోకి తీసుకుంటారు అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి సొంతపార్టీలో ఉన్న ప్రత్యేర్ధి వర్గం రోజాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కు పలు పిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం అందుతొంది. రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా నుంచి మరో ఇద్దరు నేతలు కూడా కేబినెట్ రేస్ లో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లు కూడా కేబినెట్ లో బేర్త్ సంపాధించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోన్నారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి మంత్రిపదవులు పోటీ అధికంగా కనిపిస్తోంది.
ఇప్పటికే చెవిరెడ్డి పలు మార్లు ముఖ్యమంత్రి తో భేటీ అయ్యి. తన మనుసులో మాట ఆయనకు వివరించుకున్నారు. దీంతో పాటు ఈయనకు పెద్దిరెడ్డి సపోర్ట్ ఉండడం కూడా కలిసోచ్చే అంశంగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా పెద్ది రెడ్డికి రోజాకి మధ్య గ్యాప్ చాలానే ఉంది. ఇదే అంశం రోజా పలుమార్లు బహిరంగ సభల్లోనే వ్యక్తపరిచారు కూడా. పార్టీలో కొంత మంది నేతలు తనను టార్గెట్ చేస్తోన్నారని వాపోయారు కూడా. ఒకనోక దశలో ఆవిడ మీడియా ముందు కంటతడిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంత్రిపదవి రేస్ లో ఉన్నారు అని తెలిసినప్పటి నుంచి పార్టీలో తన వ్యతిరేక వర్గం ఎలాగైన రోజాను మంత్రి కాకుండ ఆపాడానికి విశ్వప్రయత్నాలు చేస్తోన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహార్ రెడ్డి రోజాకు మంత్రి పదవి ఇవ్వడానికి పిక్స్ అయినట్లు సమాచారం రోజా శిబిరానికి ఉండడంతో ఈ విషయంలో ఆవిడ కాస్త రిలాక్స్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.