Home /News /politics /

OWAISI SAYS MIM BHARAT MUKTI MORCHA AND JANJA ADHIKAR PARTY WILL HAVE TWO CMS IN UP ASSEMBLY POLLS IF THE ALLIANCE COMES TO POWER SNR

అసదుద్దీన్ ఓవైసీ కొత్త ఎత్తుగడ..యూపీ ఎన్నికల్లో ఆ కూటమి గెలిస్తే..

Photo Credit:Twitter

Photo Credit:Twitter

UP ELECTIONS: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల పోటీల్లో అప్పుడే ఓ పొత్తు పొడిచింది. మజ్లీస్‌తో చేతులు కలిపాయి భారత ముక్తి మోర్చా, జన అధికార్‌ పార్టీలు. ఇక తమ కూటమి గెలుపు ఖాయమని చెప్పిన మజ్లీస్‌ పార్టీ అధ్యక్షుడు అధికారంలోకి రాగానే ఇద్దరు సీఎంలు ఉంటారంటూ వెరైటీ న్యూస్ చెప్పారు.

ఇంకా చదవండి ...
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు సొంతగా పోటీ చేస్తుంటే మరికొన్ని పార్టీలు కొత్త పొత్తులతో కాలు దువ్వుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh)లో ఇక యోగీ సర్కారు గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న మజ్లీస్‌ పార్టీతో దోస్తీ కట్టేందుకు రెడీ అయింది భారత్‌ ముక్తి మోర్చా(Bharat mukti morcha),జన్‌ అధికార్‌ పార్టీ (Jan adhikar party)కూటమి. ఈ ఎన్నికల బరిలోకి తాము కలిసి కట్టుగా దిగబోతున్నట్లు ఏఐఎంఐఎం (Aimim)అధ్యక్షుడు, హైదరాబాద్(Hyderabad)ఎంపీ(MP)అసదుద్దీన్‌ ఓవైవీ (Asaduddin owaisi)ప్రకటించారు. జన్‌ అధికార్‌ పార్టీ నేత బాబు సింగ్‌ కుష్వాహా(Babu Singh Kushwaha)తో సమావేశమైన అసదుద్దీన్ ఫిబ్రవరి(February)లో మొదలయ్యే ఎన్నికల సంగ్రామంలో కలిసి పోటీ చేయడమే కాదు ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని చెప్పారు. వారిలో ఒకరు ఓబీసీ, మరొకరు దళితులు ఉంటారని అన్నారు అసదుద్దీన్‌. ముస్లిం సామాజికవర్గానికి చెందిన వాళ్లు ముగ్గురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతారని ముందే పదవులు కేటాయించారు మజ్లీస్‌ పార్టీ అధినేత. ఎన్నికల నోటిఫికేషన్‌ (Notification)వచ్చింది మొదలు ..ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ని ఈసారి ఎన్నికల్లో యోగీని ఓడిస్తామని పదే పదే ప్రచారంలో చెప్పిన మజ్లీస్‌ పార్టీ చీఫ్‌..ఇప్పుడు దోస్తీ కట్టేందుకు రెండు పార్టీలు ముందుకు రావడంతో మరింత భరోసాతో ఏకంగా అధికారం రావడం, ఎవరెవరికి ఏ ఏ పదవులు అప్పగిస్తామో కూడా ముందే చెప్పేస్తున్నారు.

కూటమి కాన్ఫిడెన్స్ ..
ప్రచారంలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వంద సీట్లు గెలుస్తామని ఢంకా భజాయించిన అసదుద్దీన్‌ ఇప్పుడు ఏకంగా కూటమి బలం పెరగడంతో అధికారం చేపడాతమనే ధీమాను వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

యూపీలో పతంగి ఎగిరేనా..
ఎన్నికలు ఎన్ని విడతలుగా జరిగినా విజయంపై ఇప్పటికే సమాజ్‌వాది పార్టీ గంపెడు ఆశ పెట్టుకుంది. మరోవైపు అధికార బీజేపీలో ఏమాత్రం ఓడిపోయే ఛాన్సే లేదన్న కాన్ఫిడెన్స్‌ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగీ సర్కారును ఓడిస్తామన్న ఏఐఎంఐఎం కూటమికి ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో..ఎవరికి పొత్తుల్లో భాగంగా ఏ ఏ పార్టీకి అత్యధిక స్థానాలు పోటీ చేస్తుందో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: UP Assembly Elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు