Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. చనిపోయిన ఉద్యోగికి ట్రాన్స్‌ఫర్..

    తాజాగా శనివారం విడుదల చేసిన బదిలీల జాబితాలో చనిపోయిన ఉద్యోగి లక్ష్మి పేరు కూడా చేర్చారు. గుర్రంకొండ మండలం రేణిగుంట నుంచి అత్తూరుకు ఆమెను బదిలీ చేస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు.

    news18-telugu
    Updated: July 15, 2019, 12:58 PM IST
    ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. చనిపోయిన ఉద్యోగికి ట్రాన్స్‌ఫర్..
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఏకంగా చనిపోయిన ఉద్యోగికి కూడా ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగి చనిపోయి మూడు నెలలు గడుస్తున్నా..ఇటీవలి బదిలీల్లో అధికారులు ఆమె పేరు కూడా చేర్చడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా
    అధికారుల ఈ నిర్లక్ష్యం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గుర్రంకొండ మండలం మర్రిపాడులో పి.లక్ష్మి అనే పంచాయతీ కార్యదర్శి ఏప్రిల్ 11న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 16న మృతి చెందింది. అయితే అధికారులకు దీనిపై సమాచారం అందలేదో..మరేమో గానీ.. తాజాగా శనివారం విడుదల చేసిన బదిలీల జాబితాలో లక్ష్మి పేరు కూడా చేర్చారు. గుర్రంకొండ మండలం రేణిగుంట నుంచి అత్తూరుకు ఆమెను బదిలీ చేస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు. దీనిపై స్థానిక అధికారులను ఆరా తీయగా.. లక్ష్మి చనిపోయినట్టు ఉన్నతాధికారులకు ఇదివరకే వివరాలు పంపించామని.. అయినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని అన్నారు.
    Published by: Srinivas Mittapalli
    First published: July 15, 2019, 12:58 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading