పాక్ 'న్యూక్లియర్' బెదిరింపులపై మోదీ అదిరిపోయే కౌంటర్..

పాకిస్తాన్‌ న్యూక్లియర్ బెదిరింపులకు దిగుతుండటంతో.. అలా దాడి చేసే పరిస్థితి వస్తే తాము మాత్రం చూస్తూ ఊరుకుంటామా అన్న ఉద్దేశంతో మోదీ కామెంట్స్ చేశారు. ఇదే సభలో శ్రీలంక పేలుళ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి క్లిష్ట తరుణంలో లంకకు భారత్ అండగా నిలుస్తుందని.. ఎలాంటి సహాయానికైనా తాము వెనుకాడబోమని చెప్పారు.

news18-telugu
Updated: April 22, 2019, 6:33 AM IST
పాక్ 'న్యూక్లియర్' బెదిరింపులపై మోదీ అదిరిపోయే కౌంటర్..
ప్రధాని నరేంద్ర మోదీ (File)
news18-telugu
Updated: April 22, 2019, 6:33 AM IST
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతినే ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచారం సాగించిన మోదీ.. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్‌ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. చాలా సభల్లో పాక్ ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాజస్తాన్‌లోని బార్మర్‌లో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. పాకిస్తాన్‌ను మరోసారి టార్గెట్ చేశారు. గతంలో లాగా పాకిస్తాన్ బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో ఇప్పుడు భారత్ లేదని చెప్పారు.

పాకిస్తాన్ బెదిరింపులకు భయపడిపోయే పాలసీలను ఇప్పుడు భారత్ పక్కనపెట్టింది. మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ ప్రతీరోజూ బెదిరిస్తూనే ఉంది. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే.. ఇండియా వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌ను మేము దీపావళి కోసం దాచుకుంటామా?.
ప్రధాని మోదీ

పాకిస్తాన్‌ న్యూక్లియర్ బెదిరింపులకు దిగుతుండటంతో.. అలా దాడి చేసే పరిస్థితి వస్తే తాము మాత్రం చూస్తూ ఊరుకుంటామా అన్న ఉద్దేశంతో మోదీ కామెంట్స్ చేశారు. ఇదే సభలో శ్రీలంక పేలుళ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి క్లిష్ట తరుణంలో లంకకు భారత్ అండగా నిలుస్తుందని.. ఎలాంటి సహాయానికైనా తాము వెనుకాడబోమని చెప్పారు.

పోలింగ్ బూత్‌కి వెళ్లి మీరు ఓటేస్తున్నప్పుడు మైండ్‌లో ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు 'కమలం' గుర్తుకు ఓటు వేస్తున్నారంటే.. బీజేపీకి ఓటు వేస్తున్నట్టు కాదు.. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఓటు వేస్తున్నట్టు. మీ వేలికి అంత శక్తి ఉంది. మీరు కమలం గుర్తుకు ఓటేస్తే ఉగ్రవాదంపై మరింతగా పోరాడుతా.
ప్రధాని మోదీ

First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...